సొంత మీడియా సిబ్బందితో జగన్ నిఘా పెట్టారా ?

ఏపీ సీఎంగాగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న వైసీపీ అధినేత జగన్ ఎప్పటికప్పుడు పార్టీలోను, ప్రభుత్వంలోను ఏం జరుగుతుందనే విషయాన్ని నిఘా వర్గాల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాడు.ఇక తన ప్రభుత్వంలో అవినీతికి తావు లేదని పదేపదే చెబుతున్న జగన్ అందుకు తగ్గట్టుగానే తను మంత్రి మండలిపై పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేశారు.

 Ys Jagansecret Agents From Sakshi On Ysrcpleaders-TeluguStop.com

ఏ మంత్రి ఏ క్షణంలో ఏం చేస్తున్నారు అనే విషయంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.మంత్రుల పేషీల్లో ఎప్పటికప్పుడు జరిగే సమాచారాన్ని తను మనుషుల ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అందుకోసం తన మనుషుల ద్వారా నిఘా పెడుతున్నారట.ఇప్పటికే కొంత మంది మంత్రులు అవినీతి వ్యవహారాల్లో మునిగితేలుతున్నారు అనే ప్రచారం జరుగుతుండడంతో మంత్రి, మంత్రుల కార్యాలయాల్లో పిఆర్వో గా తన సొంత మనుషులను జగన్ ఏర్పాటు చేశారట.

Telugu Chandrababu, Cm Ys Jagan, Sakshi, Secret, Ys Jagan, Ysrcp-Telugu Politica

  జగన్ సూచనల మేరకు ఆయన సలహాదారు పి ఆర్ వో ల ఎంపిక ప్రక్రియను చేపట్టినట్టు తెలుస్తుంది.అయితే ఇందులో జగన్ సొంత మీడియాకు చెందిన ఉద్యోగులను మంత్రుల పీఆర్వోలుగా నియమించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.ఇప్పటికే అనేక కీలక విభాగాల్లో సాక్షి ఉద్యోగులను నియమించిన జగన్, మంత్రుల షెపీల్లో కూడా వారిని నియమించాలని ఆదేశించాడట.దీనికి సంబంధించి నియామకాలు ఇప్పటికే పూర్తి అయినట్లు, వారు మరో రెండు మూడు రోజుల్లో విధుల్లో చేరబోతున్నట్టు తెలుస్తోంది.

దీన్ని బట్టి చూస్తే సెక్రటేరియట్లో ఇకపై జరగబోయే ప్రతి కదలిక ఎప్పటికప్పుడు జగన్ కు చేరిపోయే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.అయితే దీనిపై మంత్రులు మాత్రం గుర్రుగా ఉన్నట్టు సమాచారం.

Telugu Chandrababu, Cm Ys Jagan, Sakshi, Secret, Ys Jagan, Ysrcp-Telugu Politica

  తమ కదలికలపై ఇలా నిఘా ఏర్పాటు చేయడం ద్వారా తమకు స్వాతంత్రం లేకుండా జగన్ చేస్తున్నారని వారిలో లో లోపల మండిపడుతున్నారు.మంత్రులుగా ఇప్పటికే తాము నామమాత్రంగా మారిపోయామని, ఇలా చేయడం ద్వారా ప్రజల్లో మరింత చులకనవుతామని వారు తమ సన్నిహితుల వద్ద అవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ విధానం కొత్తగా వచ్చింది ఏమీ కాదు గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు మంత్రుల పేషిల్లో తన మనుషులను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించారు.అయితే దీనిపై మంత్రులు అభ్యంతరం లేవనెత్తారు.

దీంతోపాటు పొత్తులో భాగంగా మంత్రివర్గంలో చేరిన బీజేపీ మంత్రులు కూడా ఈ నియామకాలను తిరస్కరించారు.ఈ విషయాన్ని చంద్రబాబు కూడా పెద్దగా పట్టించుకోలేదు.

కానీ ఇప్పుడు అదే విధానాన్ని జగన్ అమలుచేసేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube