జగన్ ప్లాన్ లు బెడిసికొడుతున్నాయా ..

రాజకీయాల్లో పై మెట్టు ఎక్కాలంటే వ్యూహం సక్రమంగా ఉండాలి.లేకపోతే కిందపడిపోవడం ఖాయం.

 Ys Jagans Mistakes Makes To Tdp Win-TeluguStop.com

ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టేలా, తమ పార్టీకి కలిసి వచ్చేలా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే ముందుకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి.ఇలాంటి వ్యూహాలు వెయ్యడంలో వైసీపీ ఘోరంగా దెబ్బతింటోంది.

జగన్ పార్టీ చేస్తున్న తప్పులే తమ అవకాశాలుగా మార్చుకుని టీడీపీ లాభపడుతోంది.రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారం దక్కించుకోవడం ఖాయం అంటూనే జగన్ తప్పులు చేస్తూ తప్పటడుగులు వేస్తున్నాడు.

ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి అనుకూల పవానాలు వీస్తున్నాయి.అపార రాజకీయ చాణిక్యుడిగా పేరుపొందిన చంద్రబాబు సమయానికి అనుగుణంగా ఎత్తుగడలు వేస్తూ రాజకీయ లబ్ది పొందుతున్నాడు.మరోవైపు సర్వేలు కూడా టీడీపీకే అనుకూలంగా వస్తున్నాయి.కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తుంది అంటూ బాబు ఎన్డీయే నుండి బయటికి రావడం.

ప్రత్యేకహోదా మరియు విభజన హామీలు నెరవేర్చాలంటూ పట్టుబట్టి కేంద్రం మీద పోరాడటం, ఇప్పుడు ఏకంగా ఇతర పార్టీల మద్దతు కూడగట్టి బీజేపీ మీద పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకోవడం, ఇలాంటి అన్ని విషయాల్లోనూ బాబు ఆలోచన సక్రమంగా పనిచేస్తోంది.

కానీ వైసీపీ అధినేత జగన్ విషయానికి వస్తే కేంద్ర అధికార పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోనప్పటికీ జగన్ బీజేపీ మీద పెద్దగా రాజకీయ విమర్శలు చేయకపోవడంతో నిజంగానే బీజేపీ వైసీపీ చీకటి ఒప్పందాన్ని కొనసాగిస్తున్నాయి అనే అనుమానం సాధారణ జనాల్లో కూడా కలిగిస్తున్నాయి.ఇది వైసీపీకి తీవ్రంగా నష్టం చేకూర్చే అంశం.ఈ నాలుగేళ్లలో అవకాశం దొరికినప్పుడల్లా ప్రత్యేక హోదా అన్న జగన్, తన పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించారు.

ఇప్పుడు పాదయాత్ర చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు.దీని వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏంటనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది.

మరోవైపు ఎంపీల రాజీనామా నిర్ణయం కూడా తప్పని విమర్శలు వినిపిస్తున్నాయి.ఎంపీలు రాజీనామా చేయకుండా ఉంటే.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో కేంద్రాన్ని ప్రశ్నించే అవకాశం ఉండేది.అలానే అవిశ్వాసానికి కూడా మద్దతిచ్చే అవకాశం ఉండేది.

కాని ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.ఈ వైపల్యాళ్లన్నీ ఖచ్చితంగా జగన్ వైఫల్యాల ఖాతాలోకే వెళ్తాయి.

ఇక ముందు కూడా ఇలాంటి తొందరపాటు నిర్ణయాలే తీసుకుంటే పార్టీ పరిస్థితి మరింత ఘోరంగా తయారవ్వడం ఖాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube