కోడి కత్తికి పదును పెడుతున్న వైసీపీ !     2018-12-15   15:45:33  IST  Sai Mallula

ఏపీలో ఎన్నికల సీజన్ దగ్గరకు వచ్చేస్తుండడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ బలాలు.. ప్రత్యర్థి పార్టీల బలహీనతలను అన్నిరకాలుగా వాడుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కోలుకోలేని దెబ్బ తినడంతో… ఏపీలో ఆ ప్రభావం పుష్కలంగా ఉంటుందని వైసీపీ నమ్ముతోంది. అందుకే టీడీపీ మీద విమర్శలు చేస్తూనే… సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో …. విశాఖ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో జరిగిన దాడి ఘటనను వైసీపీ రాజకీయంగా వాడుకోవడానికి చాలా పెద్ద పోరాటమే చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థల ఆధ్వర్యంలో జరగాలని వైసీపీ బలంగా కోరుకుంటోంది.

YS Jagans Main Agenda Is That Attack On Jagan In To People-Anchor Pradeep Anchor Reshmi Ap Elections Attack Ys Chandrababu Naidu Elections Ap Tdp Ycp

YS Jagans Main Agenda Is That Attack On YS Jagan In To People

అందుకే… దానికి అనుగుణంగానే పిటిషన్ల మీద పిటిషన్లు వేసి హైకోర్టులో విచారణ జరిగేలా చూసుకుంది. పనిలో పనిగా కేంద్రం వద్దకు వెళ్లి ఆ కేసును ఎలాగైనా కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లోకి తీసుకోవాలని విజ్ఞాపన పత్రాలు కూడా అందిస్తున్నారు. కానీ ఈ విషయంలో వైసీపీతో కేంద్రం దాగుడుమూతలు ఆడుతోంది. హైకోర్టుకు అరకొర సమాచారం ఇస్తూ అదేమంత పెద్ద కేసు కాదని పెట్టీ కేసు అన్నట్లుగా తేలికగా తీసుకుంటోంది. హైకోర్టులో కేంద్రం దాఖలు చేస్తున్న నివేదికలు చూస్తే ఇదే విషయం బయట పడుతోంది. జగన్‌ మీద దాడి ఎయిర్ పోర్టులో జరిగింది కాబట్టి ఈ ఘటన జాతీయ దర్యాప్తు సంస్థ చట్టంలో పేర్కొన్న నేరాల కిందకు వస్తుందో రాదో చెప్పాలని గత విచారణ సమయంలో కేంద్రాన్ని ఆదేశించింది.

YS Jagans Main Agenda Is That Attack On Jagan In To People-Anchor Pradeep Anchor Reshmi Ap Elections Attack Ys Chandrababu Naidu Elections Ap Tdp Ycp

దానిపై ఓ నివేదికను కేంద్రం హైకోర్టులో దాఖలు చేసింది. అందులో హైకోర్టు అడిగిన అసలు విషయం కాకుండా మిగతా కథ అంతా చెప్పింది. నిర్ణయం ఏదో హైకోర్టే తీసుకోవాలన్నట్లుగా నివేదిక ఇచ్చింది. దాంతో హైకోర్టు కేంద్రం తమతో దాగుడుమూతలు ఆడుతోందని ఆగ్రహించింది. కోడికత్తి కేసు ఎన్‌ఐఏ పరిధిలోకి వస్తుందో చెప్పకుండా ఆ బాధ్యతను తమపైకి నెట్టేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోడికత్తి ఘటన ఎన్‌ఐఏ చట్ట పరిధిలోకి వస్తుందో రాదో స్పష్టంగా తెలియచేస్తూ సీల్డ్‌ కవర్‌లో నివేదిక ఇవ్వాలని మరోసారి కేంద్రాన్ని ఆదేశించింది. కోడికత్తి కేసు ఘటనను జగన్ హైలైట్ చేయాలనుకోవడం కేంద్రానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కుంటోంది.

YS Jagans Main Agenda Is That Attack On Jagan In To People-Anchor Pradeep Anchor Reshmi Ap Elections Attack Ys Chandrababu Naidu Elections Ap Tdp Ycp

కానీ జగన్ ఇదే అంశాన్ని ఉపయోగించుకుని … రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నాడు. ఈ సెంటిమెంట్ కనుక వర్కవుట్ అయితే… ఓట్ల వర్షం కురిపించే ఆయుధం ఇదేనని జగన్ భవిస్తూ కోడి కత్తికి పదును పెడుతూ … సెంటిమెంట్ అనే మసాలా దట్టించేందుకు సిద్ధం అవుతున్నాడు.