జగన్ పోరాటం ఇక బాక్సైటు మీద

ప్రతిపక్షాలు పనిచేయడం అంటే పోరాటాలు చేయడం అని అర్ధం.ప్రజల తరపున, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయడమే అప్పోజిషన్ పని కదా.

 Jagan’s Bauxite Public Meeting On December 2-TeluguStop.com

ఇలా పోరాటాలు చేయడానికి ఏదో ఒక అంశం ఎప్పుడూ కళ్ళ ఎదురుగా ఉంటుంది.ఎవరు దాన్ని ముందుగా క్యాచ్ చేసి ప్రజల్లోకివెళతారో వారికి మైలేజీ వస్తుంది.

వైకాపా అధినేత జగన్ మొన్నటివరకు ఎపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారు.ఆరు రోజులు నిరాహార దీక్ష కూడా చేశారు.

ఇంత కష్టపడినా అమరావతి శంకుస్థాపనలో ప్రధాని మోడీ ఒక్క మాటా మాట్లాడలేదు.ప్రస్తుతం ఆ చాప్టర్ ముగిసిపోయింది.

ఇప్పుడు హాట్ సబ్జెక్ట్ విశాఖ ఏజెన్సీలో బాక్సైటు గనుల తవ్వకం.బాక్సైటు గనుల తవ్వకం కార్పోరేట్లకు అప్పగించకూడదని అప్పుడే వామపక్షాలు పోరాటాలు చేస్తున్నాయి.

మావోయిస్టులు హెచ్చరికలు చేస్తున్నారు.దీంతో జగన్ కూడా దృష్టి సారించారు.

వచ్చే నెల 2వ తేదీన పాదేరులు బహిరంగ సభ నిర్వహించ బోతున్నారు.బాక్సైటు గనుల తవ్వకానికి అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం ప్రారంభించ బోతున్నారు.11 మందితో గిరిజన హక్కుల కమిటీని ఏర్పాటు చేశారు.బాక్సైటు గనుల తవ్వకానికి టీడీపీ ప్రభుత్వం కొత్తగా అనుమతి ఇవ్వలేదని, వైఎస్సార్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి జగన్కు తెలియదా అని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

అప్పటి సర్కారు అనుమతి ఇచ్చి ఉండొచ్చు.కాని టీడీపీ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా జీవో విడుదల చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube