జగన్ కు క్రెడిట్ రావడంలో ఆ ‘లవ్ ‘ పాత్ర ఏంటి ?  

Ys Jaganlav Agarwal Corona Information - Telugu Ap Cadre, Corona Virus, Lav Agarwal, Lav Agarwal Corona Information To Jagan, Ministry Of Health And Family Welfare, Ys Jagan

కరోనా వైరస్ కు సంబంధించిన వ్యవహారం ఏపీ సీఎం జగన్ కు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది.జగన్ చేసిన సూచనలు, సలహాలు ప్రధాని నరేంద్ర నరేంద్ర మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేర్చుకోవడంతో పాటు, వాటిని అమలు చేసి చూపిస్తున్నారు.

 Ys Jaganlav Agarwal Corona Information

జగన్ అందరికంటే ముందుగా కరోనా కు సంబంధించిన జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నారు.అయితే మొదట్లో జగన్ చేసిన ప్రకటనలు, సూచనలు ప్రతిపక్షాలు అపహాస్యం చేస్తున్నాయి.

జగన్ తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు అంటూ సెటైర్లు వేస్తున్నాయి.అయితే ఆ తర్వాత దేశవ్యాప్తంగా జగన్ చెప్పిన విధానాన్ని అనుసరించాల్సిన పరిస్థితి నెలకొంది.

జగన్ కు క్రెడిట్ రావడంలో ఆ ‘లవ్ ‘ పాత్ర ఏంటి -Political-Telugu Tollywood Photo Image

ఇప్పటికే జగన్ కరోనాను కట్టడి చేసేందుకు అనేక సూచనలు చేశారు.

అలాగే రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ ఏర్పాటుపై అందరి కంటే ముందుగా జగన్ స్పందించారు.

ఈ విధానం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పారు.దీనిపైన రాజకీయ పార్టీలు, ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం జగన్ చేసిన ఈ ప్రతిపాదనను ప్రశంసించాయి.

అంతే కాకుండా దేశవ్యాప్తంగా మూడు జోన్లను కేంద్రం ఏర్పాటు చేసింది.దీంతో యావత్ భారతదేశం జగన్ చెప్పిన విధంగానే ముందుకు వెళ్తుందనే విషయం అందరికి అర్థమైంది.

అలాగే కరోనాతో మనం మరి కొంత కాలం కలిసి సహజీవనం చేయాల్సిందే అంటూ జగన్ వ్యాఖ్యానించడంపై పెద్ద దుమారమే రేగింది.వైసిపి రాజకీయ ప్రత్యర్థుల అంతా జగన్ ను హేళన చేశారు.

జగన్ కు లాక్ డౌన్ విధించడం ఇష్టం లేదని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని, అసలు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న జగన్ ఈ విధంగా ఎలా మాట్లాడుతారు అంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి.

ఆ తర్వాత వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం ఇదే విధంగా ప్రకటన చేశారు.అసలు జగన్ ముందస్తుగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ, ప్రశంసలు పొందడం వెనుక కారణం, అందరికంటే ముందుగా జగన్ కు ఈ విషయాలపై ఏ విధంగా సమాచారం అందుతుంది అనేది ఎవరికీ అంతుబట్టని విషయంగా మారింది.అయితే జగన్ కు ఎప్పటికప్పుడు కరోనా కు సంబంధించిన అన్ని రకాల ముందస్తు సమాచారం, సూచనలను కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఇస్తున్నారట.ఆయన ఏపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి.2021లో తిరిగి ఏపీ క్యాడర్ కే ఆయన రావాల్సి ఉంది.అందుకే లవ్ అగర్వాల్ జగన్ కు ముందస్తు సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.ఆయన కారణంగానే జగన్ కి దేశవ్యాప్తంగా క్రెడిట్ వస్తుందన్న వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ లోని జగన్ కు అత్యంత సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు