జగన్ గెలుపు పక్కా....కేసీఆర్ భారీ స్కెచ్..???     2019-01-19   12:41:22  IST  Surya Krishna

రాజకీయాలు చేయాలంటే చంద్రబాబు ఆ తరువాతే ఎవరన్నా అనుకునే పరిస్థితి గతంలో ఉండేది అయితే చంద్రబాబు పదవి ఇవ్వకుంటే పార్టీ పెట్టి తెలంగాణా సాధించి , ఏకంగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎవరితో పొత్తు లేకుండా గెలిచిన కేసీఆర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో వ్యుహాలకి కేరాఫ్ అడ్రస్ గా మారారు. గడిచిన తెలంగాణా ఎన్నికల్లో ఒంటరిగా పోరు చేపట్టిన కేసీఆర్ భారీ విజయాన్ని అందుకున్న తరువాత , తనని ఓడించడానికి వచ్చిన చంద్రబాబు కి ఊహించని స్థాయిలో భారీ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించాడు కూడా అయితే ఈ గిఫ్ట్ ఎలా ఉండబోతోంది అంటే ఎవరూ ఊహించని స్థాయిలోనే ఉండబోతోంది అంటున్నారు.

YS Jagan Win Is Decided Through TRS Strong Sketch-Kcr Ktr Pawan Kalyan Janasena Trs Sketch On Ys Ycp

YS Jagan Win Is Decided Through TRS Strong Sketch

ఏపీలో కుల రాజకీయాలకి పెట్టింది పేరు. ఇక్కడ రాజకీయాలు చేయాలంటే కులాల ప్రాతిపదికన మాత్రమే నడుస్తాయి. అన్ని చోట్లా ఇదేవిధమైన పరిస్థితి ఉన్నా ఏపీలో మాత్రం అన్ని రాష్ట్రాల కంటే భిన్నంగా ఉంటుంది. కాబట్టి కేసీఆర్ మొదటి గిఫ్ట్ కుల రాజకీయాల నేపధ్యంలోనే ఉండబోతోందని తెలుస్తోంది. అందుకు గాను కేసీఆర్ భారీ వ్యూహాన్ని సైతం రచించారట. ఇంతకీ ఏమిటా వ్యూహం అంటే.. టీడీపీ కి కమ్మ వర్గం , వైసీపీకి రెడ్డి వర్గం , జనసేన ని కాపు వర్గాలు ఎలా ఓన్ చేసుకున్నాయో అలాగే ఇప్పుడు ఏపీలో కేసీఆర్ వర్గంగా ఉన్నవెలమలని తమవైపుకి తిప్పుకోవడానికి వ్యూహాలు సిద్దం చేశారట.

YS Jagan Win Is Decided Through TRS Strong Sketch-Kcr Ktr Pawan Kalyan Janasena Trs Sketch On Ys Ycp

దాంతో ఇప్పటి వరకూ ఈ వర్గం ఓట్లు దండిగా పొందుతున్న టీడీపీ పార్టీ లో కలవరం మొదలయ్యింది అంటున్నారు. కేసీఆర్ ఆంధ్రాలోని తమ సామాజిక వర్గం ఓట్లపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాలో ఉన్న వెలమ ఓట్లను టీడీపీ దూరం చేసే పనిలో ఇప్పటికే కేసీఆర్ కుల పెద్దలతో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు వైసీపీ కి వచ్చే ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరినట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదే కేసీఆర్ చంద్రబాబు కి ఇచ్చే మొదటి రిటర్న్ గిఫ్ట్ అని అయితే ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని ముందు ముందు మరిన్ని గిఫ్ట్ లు బాబు కోసం కేసీఆర్ సిద్దం చేశారనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంపై టీడీపీ ఎలాంటి ప్రతి వ్యుహాలని రచిస్తుందో వేచి చూడాలి.