జగన్ అనే నేను: అలా ముహూర్తం ఫిక్స్ చేయడానికి కారణం ఇదేనా ?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను ఏపీ ముఖ్యమంత్రిగా … ఇదే ప్రసంగాన్ని చదవాలని వైసీపీ అధినేత ఎప్పటి నుంచో కలలుకంటున్నాడు.ఆ కల సాకారం చేసుకునేందుకు అనేక కష్టనష్టాలను ఎదుర్కుంటూ మొండిగా ముందుకు వెళ్ళాడు.

 Ys Jagan Will Sworn In As Cm Of Ap On May 26-TeluguStop.com

ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగిపోయాయి.ఫలితాల కోసమే అంతా వెయిటింగ్.

అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయం అనే సంకేతాలు పోలింగ్ తేదీ నుంచి వినిపిస్తుండడంతో ఆ పార్టీ అధినేత జగన్ తో పాటు మిగతా నాయకుల్లో ధీమా పెరిగింది.అందుకే తమకు ఫలానా మంత్రి పదవి కావాలంటూ కూడా జగన్ చుట్టూ ప్రదక్షణలు చేశారు.

అయితే ఆ విషయం గురించి మీరు ఎవరూ తమ చుట్టూ తిరగవద్దు అంటూ జగన్ వారికి వార్నింగ్ ఇవ్వడంతో అంతా సర్దుమణిగిపోయింది.కాకపోతే ఇప్పుడు జగన్ ప్రమాణ స్వీకారం ఫలానా తేదీన చేయబోతున్నాడు అంటూ ప్రకటనలు ఇస్తున్నారు

ఒక పక్క చూస్తే జూన్ 8 వరకు తాను సీఎంగా ఉంటానని టిడిపి అదినేత చంద్రబాబు చెబుతుంటే, జగన్ ప్రమాణ స్వీకార తేదీని కూడా ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు.

ఈ మేరకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రం మీద బాబు పెత్తనం పోయింది.ఇది తెలిసే జూన్ 8 వరకూ నేనే సీఎం అంటున్నారు.

ఇదేనా 40 ఇయర్స్ ఇండస్ట్రీ.మాకు పూర్తి విశ్వాసం ఉంది.

మా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌.మే 26న ప్రమాణ స్వీకారం చేస్తారు.

మరి చంద్రబాబు జూన్ 8 దాకా ఎలా సీఎంగా ఉంటారు’ అంటూ ప్రకటించేశారు

అయితే జగన్ ప్రమాణ స్వీకారానికి మే 26 నే ఎందుకు ఎందుకున్నారనేది ఇప్పుడు అందరికి ఆసక్తి కలిగిస్తోంది.దీనికి కారణం జగన్ మోహన్ రెడ్డి 1972 డిసెంబర్ 21న జన్మించారు.ఆయనది ఆరుద్ర నక్షత్రం.2019 మే 26వ తేదీన ధనిష్ట నక్షత్రం ఉంది.ఆరుద్ర నక్షత్రానికి ఇది పరమమైత్రి తార.ఆ రోజు ఆదివారం.సప్తమి.భాను సప్తమి.సూర్యుడు అన్ని తారలకు అధిపతి.ఇది చాలా మంచి ముహూర్తం అని పండితులు చెబుతున్నారట.

ఇలాంటి ముహూర్తాలు ప్రమాణస్వీకారం, పట్టాభిషేకానికి మంచివని వారు వివరిస్తున్నారు.అందుకోసమనే ఈ ముహుర్తాన్ని రెడీ చేసినట్టు తెలుస్తోంది.

వైసీపీ నాయకుల కంగారు చూస్తుంటే ‘ఆరాటం పెళ్ళికొడుకు పేరంటానికి వెళ్లాడనే సామెత గుర్తొస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube