AP CM Jagan : వారు వైసీపీ కి ‘కాపు ‘ కాయరనే భయం జగన్ లో ఉందా ? 

త్వరలో ఏపీలో జరగబోతున్న ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ వైసిపి 175 స్థానాల్లోనూ వైసీపీ జెండా ఎగరవేయాలనే పట్టుదలతో ఉంది .పదేపదే వై నాట్ 175  ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) వినిపిస్తున్నారు.

 Ys Jagan Will Give Ticket Kapu Caste For Next Elections Details-TeluguStop.com

ప్రతిపక్షాలకు ఎక్కడా అవకాశం దొరక్కుండా చేయాలనే ఆలోచనతో ఉన్నారు.వైసిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తిరిగి తమను అధికారంలో కూర్చోబెడతాయనే నమ్మకంతో జగన్ ఉన్నారు.

ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ,  వారి మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు.ప్రస్తుతం టిడిపి, జనసేన పొత్తు కారణంగా మెజార్టీ కాపు సామాజిక వర్గం వారు ఆ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనే అంచనాకు వచ్చిన జగన్ కాపుల మద్దతు వైసీపీకి ఉండేలా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.2014లో కాపు సామాజిక వర్గం టిడిపికి అండగా నిలిచింది.  2019లో మాత్రం వైసిపి వైపే వారంతా మొగ్గుచూపించడంతో ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించింది.

అయితే ఇప్పుడు జనసేన వైపు మెజారిటీ కాపు సామాజిక వర్గం ఉన్నట్లుగా సర్వే నివేదికలతో అలర్ట్ అయిన జగన్ , ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేసే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Telugu Ap, Chandrababu, Jagan, Kapu, Pavan Kalyan, Ysrcp-Politics

ఇటీవల 8 విడతలుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన జగన్ దీంట్లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆ సామాజిక వర్గం వారు ఎమ్మెల్యేగా ఉన్న చోట మార్పులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు.టిడిపి,  జనసేన( TDP, Jana Sena ) కంటే ఎక్కువగా కాపు నేతలకు జగన్ టికెట్లు ఇస్తున్నారు.అలాగే కాపు సామాజిక వర్గంలో కీలక వ్యక్తులుగా ఉన్న ముద్రగడ పద్మనాభం, చేగొండి హరి రామ జోగయ్య( Harirama Jogaiah ) వంటి నేతల కుటుంబాలను వైసీపీలో తీసుకువచ్చే ప్రయత్నంలో సక్సెస్ అయ్యరు.

అలాగే ఎప్పుడైతే కాపులు జనసేన వైపు చూస్తున్నారనే విషయాన్ని గ్రహించారో అప్పటి నుంచి ఆ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా ప్రత్యేక పథకాలను ప్రకటించారు.

Telugu Ap, Chandrababu, Jagan, Kapu, Pavan Kalyan, Ysrcp-Politics

నామినేటెడ్ పదవులను వారికి పెద్దపేట వేశారు.అసెంబ్లీ టికెట్ల విషయంలోనూ ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.  ఏదోరకంగా ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాలనే ప్రయత్నాలు జగన్ చేస్తున్నారు.

ముఖ్యంగా కాపు,  బలిజ ,ఒంటరి, తెలగ అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.కాపులకు తాము అన్ని విషయాల్లోనూ అండగా ఉంటామనే భరోసా ఇచ్చే విధంగా జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube