జగన్ కు కోపం తెప్పిస్తున్న ఆ ఐదుగురు ? ఫలితం అనుభవిస్తారా ?  

Ys Jagan Will Be Take Action On These 5 Monsters-chandrababu Naidu,cm Ys Jagan,ys Jagan,ys Jagan Cabinet,ysrcp

మంచి ముఖ్యమంత్రిగానే కాకుండా నీతి నిజాయితీకి మారుపేరుగా నిలుస్తూ ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్న జగన్ ను ప్రజలు, అధికారులు అర్ధం చేసుకుంటున్నా, సొంత పార్టీ నేతలు అర్ధం చేసుకోవడంలేదనే ఆవేదన ఇప్పుడు జగన్ లో ఎక్కువ కనిపిస్తోంది. ఇప్పటికే అనేక సంచలన నిర్ణయాలు, అసలు అమలు సాధ్యమే కాదనుకున్న పథకాలను ప్రవేశపుడుతూ ముందుకు వెళ్తున్న జగన్ కు ఆయన క్యాబినెట్ మంత్రులే ఇప్పుడు అడ్డుగా కనిపిలుస్తున్నారు. ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లో కీలక మంత్రులుగా ఉన్న ఓ ఐదుగురిపై జగన్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది..

జగన్ కు కోపం తెప్పిస్తున్న ఆ ఐదుగురు ? ఫలితం అనుభవిస్తారా ?-YS Jagan Will Be Take Action On These 5 Monsters

అవినీతి, మితీమీరిన జోక్యం గురించి తాను పదే పదే చెబుతున్నా వారు అస్సలు పట్టించుకోనట్టే ఉన్నారని త్వరలోనే వారిపై వేటు వేసి మిగతా వారికి గట్టి సంకేతాలు ఇవ్వాలనే ఆలోచనతో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.

అసలు తన మొదటి కేబినెట్ భేటీలోనే అవినీతి పై తాను కఠినంగా వ్యవహరిస్తానని చెప్పాడు జగన్. అయితే ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపించిన ఐదుగురు మంత్రులను పిలిచి గట్టిగా క్లాస్ తీసుకున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఆ ఐదుగురిలో ఓ మహిళా మంత్రి కూడా ఉండడం, ఆమె నిర్వహిస్తోన్న శాఖలో అన్నీ తానే అన్నట్లు ఈమె భర్తే వ్యవహరిస్తుండటంపై జగన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు మీ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినట్లు కూడా తెలుస్తోంది.

ఇక తన సొంత జిల్లాకు అన్నీ తానే అన్నట్లు వ్యవహరిస్తోన్న ఓ సీనియర్ మంత్రి వ్యవహార శైలిపైనా జగన్ సీరియస్ గా ఉన్నట్లు పార్టీ నాయకుల ద్వారా తెలుస్తోంది..

అలాగే మరో కీలక శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న ఓ మంత్రి అప్పుడే రెండు కోట్ల లంచం కోసం చేతులు చాపారన్న గుస, గుసలు రావడంతో జగన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. అలాగే తన మంత్రిత్వశాఖలో అప్పుడే కాంట్రాక్ట్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరొక మంత్రి పై కూడా వేటు తప్పదని తెలుస్తోంది.

అయితే ఈ వ్యవహారం అంతా బయటకి పొక్కకుండా జగన్ జాగ్రత్త పడుతున్నాడట. వీరిని తొలగించడానికి వేరే కారణాల కోసం వెతుకుతున్నాడట. దీన్ని బట్టి చూస్తే జగన్ క్యాబినెట్ లో ప్రకాశాలన తప్పదన్నట్టుగానే పరిస్థితి ఉంది.