దేశంలో సీఎం రేసులో ఊహించని ర్యాంకు సాధించిన వైయస్ జగన్..!!

దేశంలో ముఖ్యమంత్రుల పనితీరుపై ఏబీపీ, సీ-ఓటర్ చేసిన సర్వేలో టాప్ త్రీ సిఎంలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చోటు దక్కించుకున్నారు.టాప్ ర్యాంకింగ్స్ లో వరుసగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో ఉండగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు.

 Ys Jagan Who Achieved An Unexpected Rank In The Cm Race In The Country,ys Jagan,-TeluguStop.com

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడో స్థానంలో నిలిచారు.దాదాపు 30 వేల మంది కలసి 500కు పైగా పార్లమెంటు నియోజకవర్గాలలో జరిపిన ఈ సర్వేలో వచ్చిన ఫలితాలు ఏమిటి.

Telugu Abp Voter, Kejriwall, Naveen Patnik, Ys Jagan-Telugu Political News

అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కాకపోయినా గాని తల పండిపోయిన ముఖ్యమంత్రులకు పోటీగా జగన్ గత కొన్నాళ్ల నుండి వరుసగా ర్యాంకులు సాధించటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ప్రభుత్వ పథకాలు ఎక్కడ ఆగిపోకుండా  మరోపక్క పేదవాళ్ల బతుకులపై విద్య అదేవిధంగా వైద్యం భారం కాకుండా జగన్ తీసుకున్న నిర్ణయాలు.చాలా వరకు వైసిపి పార్టీకి అనుకూలంగా ఫలితాలు తేప్పిస్తున్నట్లు అందువల్లే ప్రజలంతా సంతోషంగా ఉన్నట్లు ఏబీపీ సీ-ఓటర్ చేసిన సర్వేలో జగన్ కి వచ్చిన ర్యాంకు పై చాలా మంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.కాగా సీఎం స్థానంలో కూర్చున్న నాటినుండి పేరుగాంచిన మ్యాగజైన్లు ఇంకా ఏబీపీ, సీ-ఓటర్ లాంటివి చేస్తున్న సర్వేలలో మొదటినుండి టాప్ ఫైవ్ లో ఉండే రీతిలో జగన్ ర్యాంకులు సాధించడం పట్ల వైసీపీ శ్రేణులు కూడా తాజా ర్యాంకు బట్టి కాలర్ ఎగరేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube