జగన్ దూకుడుకి బ్రేకులు పడేది ఎప్పుడు ?  

Ys Jagan When He Gets Break From His Dukudu-ap Assembly Meetings,chandrababu Naidu,cm Ys Jagan,jr Ntr,tdp,telugu Viral News Updates,ys Jagan,ysrcp

అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటివరకు జగన్ దూకుడుకి బ్రేకులే లేవన్నట్టుగా పరిపాలన సాగుతోంది. తాను అధికారంలోకి వచ్చేందుకు చేపట్టిన పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చుసిన జగన్ వారి కష్టాలను తీర్చడం కోసం ఇప్పుడు ఎన్నో పథకాలను అమలుచేస్తున్నాడు. అలాగే ఎన్నికల మ్యానిఫెస్టో అయిన ‘నవరత్నాలు’ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందులో పొందుపరిచిన ప్రతి పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన నెల రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు..

జగన్ దూకుడుకి బ్రేకులు పడేది ఎప్పుడు ? -YS Jagan When He Gets Break From His Dukudu

ఇంతవరకు బాగానే ఉన్నా జగన్ తీసుకుంటున్న కొన్ని కొన్ని నిర్ణయాలు, మంత్రులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ కల్పించకపోవడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా పార్టీలోని కీలక నాయకులే భావిస్తుండడం కొంత ఆలోచింపచేసే విషయమే.

ఒక ముఖ్యమంత్రిగా ఏపీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకునే హక్కయినా జగన్ కు ఉంటుంది. అయితే ఆ నిర్ణయాల విషయంలో జగన్ ఒకటికి రెండు సార్లు ఆలోచించి, చర్చించి నిర్ణయాలు తీసుకుంటే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గతంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రజలు ఇప్పటికీ ఆరాధించడం, ఆయన అంత పేరు సంపాదించుకోవడానికి కారణం తాను చెప్పబోయే హామీల దగ్గర నుంచి ప్రజల ముందు మాట్లాడే మాట దాకా అన్ని విషయాల్లోనూ ఎన్నో ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకునేవాడు.

ఏదైనా ఒక పనిని మొదలుపెట్టాలంటే దాని గురించి ఒకటికి పది సార్లు ఆలోచించేవాడు. అంతే కాదు దానికి సంబందించిన విషయంలో అనుభవం ఉన్న అధికార్లను సంప్రదించి ముందుకు వెళ్ళేవాడు..

అయితే ఈ విషయంలో జగన్ ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు అందరిని ఆలోచింప చేస్తోంది.

పైకి జగన్ అధికారులతో సఖ్యతగా ఉన్నట్టు కనిపించినా వారు చెప్పింది పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నా జగన్ మాత్రం సొంత నిర్ణయాలు తీసుకుంటూ తాను చెప్పింది జరిగిపోవాలంటూ ఒక ముఖ్యమంత్రిగా చెబుతున్నాను అని అంటున్నాడట. అయితే అధికారులు మాత్రం జగన్‌కు అడ్డు చెప్పలేక కొన్ని కొన్ని విషయాలలో అసంతృప్తికి గురవుతున్నారట. ఈ విషయంలో జగన్ కాస్త దూకుడు తగ్గించుకుని ముందుకు వెళ్తే రానున్న రోజుల్లో ఎటువంటి అసంతృప్తులు చెలరేగకుండా ఉంటాయి.

లేకపోతే అసమ్మతి చాపకింద నీరులా విస్తరిస్తుంది.