వైసీపీకి వారు 'కాపు' కాయక్కర్లేదా...?  

Ys Jagan Ways To Help Kapu People In 2019 -

ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయంటే చాలు .రాజకీయ పార్టీలు ఎక్కడ లేని కొత్త కొత్త ఎత్తుగడలతో ముందుకు వెళ్తుంటాయి.

Ys Jagan Ways To Help Kapu People In 2019

ఏదో ఒక రకంగా ఓటర్ దేవుళ్ళను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగి తేలుతుంటాయి.ఈ సమయంలోనే ఆయా సామాజిక వర్గాల మద్దతు కూడగట్టి తమ విజయానికి బాటలు వేసుకోవాలని చూస్తాయి.

అందుకే ఈ కీలక సమయంలో ఈ ఒక్క సామాజిక వర్గాన్ని కూడా దూరం చేసుకోకుండా …అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని చూస్తుంటాయి.అయితే ఈ విధానాన్ని వైసీపీ మాత్రం పాటించడం లేనట్లుగా కనిపిస్తోంది.అయితే… జగన్ తెలిసి చేస్తున్నారో తెలియదు చేస్తున్నారో కానీ … ఏపీలో కీలకంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని మాత్రం ఆయన అస్సలు పట్టించుకోవడం లేదు సరి కదా మరింత దూరం చేసుకునేలా వ్యవహరిస్తున్నాడు.

వైసీపీకి వారు ‘కాపు’ కాయక్కర్లేదా…-Political-Telugu Tollywood Photo Image

అసలు సమయం సందర్భం లేకుండా… ఇంతకు ముందు కాపు రిజర్వేషన్లు గురించి సంచలన వ్యాఖ్యలు చేసి కాపుల ఆగ్రహానికి గురయ్యారు.ఒక వైపు చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా ఆ వర్గం ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఈ సమయంలోనే వైసీపీలో ఉన్న ఆ సామాజిక వర్గం నాయకులను జగన్ పట్టించుకోకపోవడమే కాకుండా… వారు పార్టీ వదిలి బయటికి వచ్చేలా వ్యవహరిస్తూ పూర్తిస్థాయిలో ఆ వర్గానికి వ్యతిరేకం అన్నట్టుగా ముద్ర వేయించుకుంటున్నాడు.

అసలు కాపు సామాజిక వర్గం ఇచ్చిన స్ట్రోక్ అసలు జగన్ కు గత ఎన్నికల్లోనే గట్టిగా తగిలింది.దాదాపు ఆ ఎన్నికల్లో జగన్ పార్టీ విజయం దాదాపు ఖాయం అనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీ కి మద్దతుగా రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో ఫలితాలను తారుమారు చేసేసాడు.

గత ఎన్నికల్లో అధికారం పోయినప్పటి నుంచి జగన్ మోహన్ రెడ్డి.పార్టీలో ఉన్న కీలక కాపు నేతలందరూ బయటకు వెళ్లిపోయేలా పరిస్థితులు కల్పించాడు.జ్యోతుల నెహ్రూ నుంచి వంగవీటి రాధా వరకు కాపు కీలక నాయకులంతా … ఈ విధంగానే బయటకి వెళ్లిపోయారు.

తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా కృష్ణ వ్యవహారమే తీసుకుంటే… రాష్ట్రం మొత్తం కాపు సామాజికవర్గం ప్రభావం చూపించగల స్థాయిలో ఉన్న వంగవీటి విషయంలో జగన్ వ్యవహరించిన తీరు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది.రాధకు జగన్ కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడం సీనియర్ నేతలను కూడా ఆశ్చర్య పరిచింది.విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో రాధను పిలిచి మాట్లాడితే ఆయన మెత్తబడేవారేమో.

కానీ జగన్ అలా చేయలేదు సరికదా ఉంటే ఉంటారు లేకపోతే బయటకి పోతారు అన్నట్టుగా … వదిలేసాడు.ఈ వ్యవహారం వైసీపీకి మరింత చేటు తీసుకొచ్చిందనే చెప్పాలి.

అయితే… చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు రాధను బుజ్జగించేందుకు ఆ పార్టీ నేతలను బతిమిలాడుతుండడం మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది.అయితే రాధకు టీడీపీ నుంచి భారీ ఆఫర్ రావడంతో ఎటువైపు అడుగులు వెయ్యాలి అనే విషయంపై తన అనుచరులతో మంతనాలు చేస్తున్నాడు.

ఏది ఏమైనా ఈ వ్యవహారం కాపుల్లో వైసీపీ ఇమేజ్ కొంచెం డ్యామేజ్ అయినట్టుగానే కనిపిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ys Jagan Ways To Help Kapu People In 2019- Related....