తప్పులు దిద్దుకుంటున్న జగన్ ... ఇక ఆ పొరపాట్లు చేయడట

చాలా కాలంగా అధికారం కోసం ఎదురు చూస్తున్న జగన్ ఇక వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ .ఆ అవకాశం వదులుకోకూడదని చూస్తున్నాడు.

 Ys Jagan Wants To Rectify His Mistakes In 2019-TeluguStop.com

అందుకే గత ఎన్నికల సమయంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేయడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయావకాశాలు వదులుకోకూడదని చూస్తున్నాడు.ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అవుతున్న ఆయన ప్రజలు తమ నుంచి ఏమి కోరుకుంటున్నారు.? ఇంకా లోపాలు ఏమి ఉన్నాయి.? గత ఎన్నికల్లో గెలవకపోవడానికి గల కారణాలు ఏంటి .? అనే అన్ని అంశాల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇప్పుడు వాటిని అమలుపరుస్తున్నాడు.

పార్టీ ఏర్పాటు చేసి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా … మొన్నటి వరకూ పార్టీ అనుబంధ సంఘాలను బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టలేదు.గత ఎన్నికల్లో ఈ సంఘాలను సరిగా వినియోగించుకోకపోవడంతోనే ఓటమి చవి చూడాల్సి వచ్చిందని జగన్ భావిస్తున్నారు.అందుకే పార్టీలో వరసగా అన్ని కమిటీలు వేసి వరుస సమావేశాలు నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇప్పటికే విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో బీసీ, మహిళా, విద్యార్ధి, యూత్, మైనారిటీ మీటింగ్ లను నిర్వహించారు.గ్రామాల్లో ఆయా కమిటీల పరిధిలోని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో, దానికి తీసుకోవాల్సిన చర్యలేమిటన్న దానిపై స్పష్టమైన అభిప్రాయ సేకరణ చేయాలని కమిటీలను ఆదేశించనున్నారు.

ఇటీవల జరిగిన బిసి సదస్సుకు జగనే స్వయంగా హాజరై వారికి అండగా ఉంటానని స్పష్టమైన హామీ ఇచ్చారు.అంతేకాదు ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున బీసీలతో అనంతపురంలో బీసీ డిక్లరేషన్ పార్టీ తరపున ప్రకటించ నున్నారు.సమాజంలోని అన్ని వర్గాలను ఆకట్టుకునేలా జగన్ వ్యూహ రచన చేస్తున్నారు.ఇంకా పార్టీలో , నాయకుల్లో ఉన్న లోపలన్నిటిని గుర్తించడమే కాకుండా , వాటిని సరిదిద్ది ప్రజల దృష్టిని ఆకర్షించి తద్వారా ఓట్ల రూపంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని జగన్ ఆలోచన చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube