ఆ మీడియా బలం తెలుసుకున్న జగన్.. అందుకే ఈ నిర్ణయం  

Ys Jagan Wants To More Popular In Social Media-

ఎలక్ట్రానిక్ మీడియా . ప్రింట్ మీడియా మీద జనాలకు ఎప్పుడో ఆసక్తి తగ్గిపోయింది..

ఆ మీడియా బలం తెలుసుకున్న జగన్.. అందుకే ఈ నిర్ణయం -YS Jagan Wants To More Popular In Social Media

ఎందుకంటే… మీడియా యాజమాన్యాలు తమ స్వప్రయోజనాలు ఆశించి తమకు అనుకూలంగా ఉండే పార్టీల భావజాలాన్ని ప్రజల మీద అదే పనిగా రుద్దేస్తున్నాయి. ఈ ధోరణితో మీడియా విశ్వసనీయత మరింతగా దిగజారుతూ వస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా జోరు పెరిగింది. ఎక్కడ ఏమి జరిగినా ఎటువంటి దాపరికం లేకుండా సోషల్ మీడియాలో వచ్చేస్తుండడం కూడా ఆ మీడియా కు ఆదరణ తగ్గడానికి ఒక కారణం.

ఈ విషయాన్ని గత ఎన్నికల ఫలితాల అనంతరం గుర్తించిన వైసీపీ అధినేత జగన్ దీనిపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాడు.

ఇప్పటికే సోషల్ మీడియా పరంగా వైసీపీ చాలా బలంగా ఉంది. సాధారణ మీడియాకు ధీటుగా ప్రభుత్వ తప్పులను వెతికిపట్టుకోవడం … అది సోషల్ మీడియా వేదికగా జనాలకు తెలిసేలా చేయడంలో వైసీపీ సక్సెస్ అవుతూ వస్తోంది. గత ఎన్నికల ముందు వైసీపీ ఈ విషయంపై దృష్టిపెట్టకపోవడంతో జరగరాని నష్టమే జరిగిపోయింది. ప్రస్తుతం అధికార పార్టీనేతలు ఏం చేసినా సాధారణ మీడియా బయటకు రానివ్వడంలేదు.

ప్రభుత్వాలు చేస్తున్న తప్పులు సోషియల్ మీడియా ద్వారా క్షణాల్లో ప్రజలకు చేరుతున్నాయి. అందుకే ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న తరుణంలో వైసీపీ సోషల్ మీడియా పై మరింత పట్టు పెంచుకునేందుకు సిద్ధం అవుతోంది. .

ప్రస్తుతం వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు సోషియల్ మీడియా వేదికగా దూసుకుపోతున్నాయి. గడచిన మూడున్నరేళ్ళుగా సోషల్ మీడియాలో జగన్ కు అనుకూలంగా వైసీపీ సోషల్ మీడియా ప్రచారంలో అందరికంటే ముందు ఉంది.

ఒకవైపు జగన్ అనుకూల ప్రచారం చేస్తూనే మరోవైపు చంద్రబాబునాయుడు, నారా లోకేష్, తెలుగుదేశంపార్టీలకు వ్యతిరేకంగా దుమ్ము దులిపేస్తోంది. జగన్‌పై అధికార పార్టీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అందుకు రెట్టింపు సంఖ్యలో జగన్ కన్నా ఎక్కువగానే కౌంటర్లు ఇస్తోంది. అందుకే సోషల్ మీడియా జోరును మరింత పెంచాలని జగన్ నిర్ణయించారు..

అందులో భాగంగానే మండలస్ధాయిలో కూడా సోషల్ మీడియా ప్రచారం కోసం ప్రత్యేకంగా కమిటీలను వేశారు. టార్గెట్ టీడీపీ అనే నినాదంతో అధికార పార్టీ తప్పొప్పులను మండల స్థాయి నుంచి కూడా వెలికితీసేందుకు వైసీపీ సిద్ధం అవుతోంది.