శ్రీమంతులు కావలెను : సీటు ఇస్తాం... పోటీ చేస్తారా ...?

డబ్బు చుట్టూ రాజకీయం … రాజకీయం చుట్టూ డబ్బు తిరగడం ప్రస్తుత పరిస్థితుల్లో మాములు విషయమే.డబ్బు లేకుండా రాజకీయాల్లో రాణించాలంటే చాలా కష్టం.

 Ys Jagan Wants To Give Party Tickets For Strong Economic Background-TeluguStop.com

అసలు అసాధ్యం అనే చెప్పాలి.రాజకీయ పార్టీలు కూడా ఆర్ధిక స్థితిమంతులు ప్రోత్సహించేందుకు ఎప్పుడూ… ప్రాధాన్యం ఇస్తుంటాయి.

పార్టీ టికెట్లు కేటాయింపు కూడా దాదాపు ఇదే ప్రధాన అర్హతగా చూస్తున్నారు.ఇంకా విషయానికి వస్తే … ఏపీలో ఒకవైపు ఎన్నికలు దూసుకు వస్తున్నాయి.

ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టాయి.అందుకే పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కొన్ని అర్హతల్ని పెట్టుకుని, గెలిచే సత్తా ఉన్నవారినే ఎంపిక చేసేందుకే దాదాపు అన్ని పార్టీలూ ప్రయత్నాలు ప్రారంభించాయి.

ఇక ఈ విషయంలో టీడీపీ కంటే తామే ముందు ఉండాలని వైసీపీ భావిస్తోంది.ఈ పార్టీలో అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి అయ్యిందనే వార్తలు వచ్చినా వైసీపీ ఏ విషయం బయటకి వెల్లడించడంలేదు.

తెలంగాణలో కేసీఆర్ అనుసరించినట్టుగా, ఎన్నికలకు కొన్ని నెలల ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించేస్తే.రెబెల్స్ బెడదను తట్టుకోవడం సులువు అవుతుందని జగన్ భావిస్తున్నట్టూ కథనాలొచ్చాయి.ఇచ్ఛాపురంలో జరిగిన పాదయాత్ర ముగింపు సభలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వైసీపీ నేతలు ఆశపడ్డారు.అయితే అలా జరగలేదు.

దీని వెనుక కూడా పెద్ద రీజన్ కూడా ఉందట.

ఆర్ధికంగా బలమైన ప్రత్యర్థిగా ఉన్న టీడీపీని ఎదుర్కోవడం అంటే… సాధారణ విషయం కాదు.అందులోనూ టీడీపీ ఖర్చుకు వెనకాడకుండా గెలవాలని చూస్తోంది.ఈ నేపథ్యంలో పార్టీ తరపున పోటీ చేసే అబ్యర్దులు కూడా ఆర్ధీకంగా బలమైన వ్యక్తులు ఉంటే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయని జగన్ భావిస్తున్నాడు.

అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది.? ఆర్ధిక స్థితిమంతులు ఎవరు అనే విషయంపై వైసీపీ రెండు బృందాలతో క్షేత్రస్థాయిలో సర్వే చేయిస్తోందని సమాచారం.ఏయే నియోజక వర్గాల్లో వైసీపీ బలహీనంగా ఉంది, టిక్కెట్లు ఆశిస్తున్నవారి బలాబలాలు ఏంటనే విషయం పై సర్వేలు జరుగుతున్నట్టు చెబుతున్నారు.ఈ సర్వేల ఆధారంగా.ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఎక్కడెక్కడ అవసరమౌతారు అనే లెక్కలు వేస్తోంది వైసీపీ.ఆయా నియోజకవర్గాల్లో ఆర్ధిక స్థితిమంతులు గుర్తించి వారు పార్టీలో లేకపోయినా ఒప్పించి మరీ సీటు ఇవ్వాలని వైసీపీ ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ విషయంలో పార్టీని నమ్ముకుని… నమ్మకంగా ఉన్నవారిని కూడా పక్కనపెట్టి ఆర్ధికంగా బలవంతుల కోసం వైసీపీ వెతుకులాట మొదలుపెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube