ఆ సభలో వైసీపీ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించబోతున్నారా ...?

ఇప్పుడు ఏపీలో టీడీపీ – వైసీపీ పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ఎత్తులు వేస్తున్నాయి.ఒకరిని మించి మరొకరు రాజకీయ వ్యూహాలు రూపొందించుకుంటూ… ఎన్నికల బరిలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి.

 Ys Jagan Wants To Announce The Ycp Candidates List In The Meeting-TeluguStop.com

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే మొహమాటం.పంతాలు.

పట్టింపులు పక్కనపెట్టి తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ అనుసరించిన రాజకీయాలను ఏపీలో అమలుచేయాలని చూస్తున్నాడు.ఎన్నికల ముందు కేసీఆర్ వ్యూహాలను అంతా ఎద్దేవా చేసినా… ఫలితాల తరువాత కేసీఆర్ వ్యూహాలను.ధైర్యాన్ని అంతా మెచ్చుకున్నారు.అందుకే… ఇప్పుడు బాబు కూడా అదే బాట పట్టాడు.దీనిలో భాగంగానే…సంక్రాంతి వెళ్లిన తర్వాత వంద మంది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తానని బాబు ప్రకటించారు.ఇది ఓ రకంగా ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం లాంటిదే.ఎందుకంటే.చంద్రబాబుకు.

చివరి నిమిషం వరకూ టిక్కెట్లను ఖరారు చేసే అలవాటు లేదు.కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పదు.

వాస్తవంగా టీడీపీ లో టికెట్ల కేటాయింపులన్నీ… నామినేషన్స్ వేసే ముందు మాత్రమే ప్రకటించి… చివరి వరకు సస్పెన్స్ కొనసాగిస్తుంటారు.కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో … ఇప్పుడు ముందస్తుగా అభ్యర్థుల లిస్ట్ ప్రకటించేందుకు బాబు సిద్ధం అవుతున్నాడు.అయితే బాబు వేసే ప్రతి ఎత్తుకి… పై ఎత్తు వేసే వైసీపీ అధినేత జగన్ కూడా ఇప్పుడు తన రాజకీయాన్ని మార్చుకున్నారు.టీడీపీ వేసే ప్రతి అడుగుకి … ముందడుగు వేసేలా… జగన్ తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాడు.

అందుకే పార్టీ అభ్యర్థుల విషయంలో ఆయన బహిరంగ ప్రకటనలేమీ చేయకుండానే.అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారట.శ్రీకాకుళం జిల్లాలో జగన్ పాదయాత్ర జనవరి ఎనిమిది లేదా తొమ్మిదో తేదీన ముగుస్తుంది.అందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు.పైలాన్ కూడా సిద్ధం చేస్తున్నారు.

ఈ సభలోనే 120 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతున్నారని టాక్ నడుస్తోంది.

ఈ మేరకు ఇప్పటికే వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ అనేక సర్వేలను నిర్వహించి అభ్యర్థుల జాబితా రెడీ చేసినట్టు సమాచారం.అదీ కాకుండా ఈ మధ్యకాలంలో వైసీపీ లో అనేక భారీ ప్రక్షాళనలు జరిగాయి.చాలామంది వైసీపీ నియోజకవర్గ ఇంచార్జిలను మార్చి .కొత్తవారికి అవకాశం కల్పించారు.వీరిలో అత్యంత నమ్మకస్తులైన వారిని కూడా జగన్ తప్పించారు.

వారెవరికీ.చివరి నిమిషంలో కూడా టిక్కెట్లు ఇవ్వడం లేదని.

కొత్తగా సమన్వయకర్తలుగా నియమించిన వారికే టిక్కెట్లు ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.ఇటువంటి చోట్ల అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తే.

పార్టీ మీద అభిమానం ఉన్నవాళ్లు ఉంటారు… లేని వాళ్ళు తమ దారి తాము చూసుకుంటారు అనే ఆలోచనలో జగన్ ఉన్నారట.మొత్తానికి వైసీపీ టీడీపీకంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే అది పెద్ద సంచలనమే అవుతుంది అందంలో సందేహమే లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube