బీజేపీతోనే పొత్తు..కానీ జగన్ షాకింగ్ స్టేట్మెంట్     2018-01-22   22:06:44  IST  Bhanu C

జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు..పాదయాత్రలో బాగంగా సత్యవేడులో జగన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు..ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు ఉండబోతున్నాయి అనే విషయం మాత్రం స్పష్టం అయ్యింది అంటున్నారు పొత్తుల విషయంలో జగన్ ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్టుగా జగన్ మాటల బట్టి అర్థం అవుతోంది..జగన్ ఏమన్నారంటే..

ప్రత్యేకహోదాను గనుక భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకుంటే..బీజేపీతో పొత్తుకు మేము సిద్దంగా ఉన్నాం అంటూ ప్రకటించారు..హోదా విషయంలో బీజేపి ఓ అడుగు ముందుకు వేస్తే చాలు బీజేపీతో కలిసి నడవడానికి సిద్దంగా ఉన్నాం అంటూ కుండబద్దలు కొట్టారు..అయితే తనపై ఉన్నకేసులన్నీ కాంగ్రెస్, టిడిపి కలిసి పెట్టినవే అని ఇప్పటికీ టిడిపి,కాంగ్రెస్ భందం ఒకే లా ఉందని తెలిపారు.

అయితే తమ ప్రధానమైన టార్గెట్ చంద్రబాబు నాయుడు ఒక్కడే నని..బాబు పాలన అంతా అబద్దాలతో, అవినీతితో సాగుతోందని మండిపడ్డారు…తాను కాంగ్రెస్ లో ఉన్నంత కాలం గౌరవీయనీయమైన వ్యక్తిగానే ఉన్నట్లు గుర్తుచేశారు. పోయిన ఎన్నికల్లో కూడా చంద్రబాబు అబద్దపు హామీలిచ్చే అధికారంలోకి వచ్చినట్లు జగన్ మండిపడ్డారు. చంద్రబాబు ఏకకాలంలో ఇటు ప్రజలను అటు ప్రధానమంత్రిని మిస్ లీడ్ చేస్తున్నట్లు ధ్వజమెత్తారు…అయితే జగన్ చేసిన తాజా వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ మొదలైంది. ఎందుకంటే, మూడున్నరేళ్ళుగా కేంద్రప్రభుత్వం ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చే ఉద్దేశ్యం లేదని తేలిపోయింది. ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో కేంద్రం ఇప్పటికే పలుమార్లు మాట మార్చిందని తెలిపారు ఇలాంటి సందర్భంలో జగన్ ప్రత్యేక హోదా విషయలో బీజేపీతో లింక్ పెట్టి మాట్లాడటం ఎన్నో అనుమానాలకి తావిస్తోందని అంటున్నారు విశ్లేషకులు..