ఆ మంత్రులు మాట వినడంలేదటగా ?

పారదర్శకమైన పాలనతో ఏపీ ప్రజల మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవాలని వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ భావిస్తూ వస్తున్నారు.అందుకోసమే ఏపీ ఖజానా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా కేంద్రం నుంచి సరైన ఆర్థిక సహకారం అందకపోయినా జగన్ మాత్రం సంక్షేమ పథకాల అమలు విషయం లో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.

 Ys Jagan Unhappy With His Some Of The Cabinet Ministers-TeluguStop.com

అధికారంలోకి వచ్చిన అతికొద్ది సమయంలోనే 80 శాతం హామీలను నెరవేర్చడమే కాకుండా, పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీని జగన్ చేపట్టాడు.గ్రామ వాలంటీర్ వ్యవస్థకు రూపకల్పన చేసి పంచాయతీల రూపురేఖలను మార్చేందుకు నడుంబిగించాడు.

ఇక రివర్స్ టెండరింగ్, పీపీయేల రద్దు, ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం ఇవన్నీ జగన్ పనితీరుకు అద్దం పడుతున్నాయి.

జగన్ పరిపాలన తీరు ఈ విధంగా ఉంటే ఆయన సహచర మంత్రుల పని తీరు మరోలా ఉండడం జగన్ కు తీవ్రమైన అసహనాన్ని కలిగిస్తోంది.

కొంతమంది మంత్రులు మితిమీరి ప్రవర్తిస్తుండడం పై జగన్ వారిని పిలిచి మందలించినా వారిలో పెద్దగా మార్పు కనిపించడం లేదట.క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్న జగన్ దానికి తగ్గట్టుగా తన పని తీరు, తన సహచర మంత్రులు పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాడు.

ఏ మంత్రి అవినీతి వ్యవహారాల్లో తలదూర్చి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే సహించేది లేదని, మొదటి కేబినెట్ సమావేశం నుంచి జగన్ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాడు.

Telugu Chandrababu, Pawankalyan, Ys Jagan, Ysrcp-Telugu Political News

తాజాగా ఈ బుధవారం జరిగిన ఏపీ క్యాబినెట్ మీటింగులో ఇదే విషయమై కొంతమంది మంత్రులు పై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.కొంతమంది మంత్రులు సొంత వ్యవహారాల్లో బిజీగా ఉంటూ పరిపాలన విషయాలు పెద్దగా పట్టించుకోవడం లేదని జగన్ అసహనం వ్యక్తం చేశాడట.ఇకపై ప్రతి మంగళ బుధవారాల్లో మంత్రులు ఖచ్చితంగా సచివాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారట.

కొంతమంది మంత్రులు సచివాలయం వైపే చాలా కాలంగా కన్నెత్తి చూడకపోవడం పై వారి పేర్లు ప్రస్తావించి మరి జగన్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.అయితే జగన్ వార్నింగ్ లతో ఆ మంత్రులు పనితీరు మార్చుకుంటారో లేక యధా మామూలుగానే వ్యవహరిస్తారో చూడాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube