అదే జ‌రిగితే జ‌గ‌న్ పార్టీకి పెను ప్ర‌మాద‌మే…!  

Undavalli Arun Kumar Suggestions to YCP, undavalli arun kumar,andhra pradesh,chief minister jagan mohan reddy, TDP,chandra babu naidu,BJP Trap, YCP leaders - Telugu Andhra Pradesh, Bjp Trap, Chandra Babu Naidu, Chief Minister Jagan Mohan Reddy, Tdp, Undavalli Arun Kumar, Undavalli Arun Kumar Suggestions To Ycp, Ycp Leaders

రాజ‌కీయాల్లో మాట‌లు చెప్ప‌డం వేరు.ప‌నులు చేయ‌డం వేరు.

TeluguStop.com - Ys Jagan Undavalli Arun Kumar Bjp Trap

క్షేత్ర‌స్థాయిలో సాధించ‌డం వేరు.ఈ మూడు ప్ర‌క్రియ‌ల్లో మొద‌టి రెండు తేలికేమోకానీ.

మూడోది మాత్రం అంత ఈజీకాదు.గ‌తంలో ఏపీ విష‌యంలో చంద్ర‌బాబు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుతో పొత్తు పెట్టుకున్నారు.

TeluguStop.com - అదే జ‌రిగితే జ‌గ‌న్ పార్టీకి పెను ప్ర‌మాద‌మే…-General-Telugu-Telugu Tollywood Photo Image

సాధించ‌లేక పోయారు.విభేదించారు.

అప్పుడు కూడా సాధించ‌లేక పోయారు.అలాంటిది ఇప్పుడు త‌న‌పై ప‌దుల సంఖ్య‌లో కేసులు ఉన్న జ‌గ‌న్ .ఢీ అంటే ఢీ అని సాధించి చూప‌గ‌ల‌రా? అనేదిమిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఎందుకంటే.

ప్ర‌స్తుతం మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ కొన్ని స‌వాళ్లు రువ్వారు.మోడీని ఎదిరించు.

మిగిలిన రాష్ట్రాల్లో ఇదే క‌దా చేస్తున్నారు.అంటూ.

తెలంగాణ‌, మ‌హారాష్ట్ర వంటి రాష్ట్రాల ఉదాహ‌ర‌ణ‌లు సైతం చూపించారు.నిజ‌మే! ఇవ‌న్నీ వినేందుకు.

చెప్పుకొనేందుకు బాగానే ఉన్నా.జ‌గ‌న్ వంటి నాయ‌కుడికి సాధించే క్ర‌మంలో ఎదుర‌య్యే క‌ష్టాలు అన్నీ ఇన్నీ కాదు.

ఏపీలో బ‌ల‌మైన పార్టీగా ఉన్న టీడీపీని ఢీ కొట్టి బ‌ల‌మైన మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌.వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం అత్యంత అవ‌స‌రం.

లేక‌పోతే.సాధించిన విజ‌యం వాపు లాగే త‌యార‌వుతుంది త‌ప్ప‌.బ‌లం కానేకాదు.ఇక‌, కేసుల విష‌యాన్ని చూస్తే.అవ‌న్నీ నిజ‌మోకాదో.నిరూపిత‌మ‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని కొంద‌రు అంటే.

తేలిపోతాయ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ, టీడీపీలు ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నాయి.

ఈ స‌మ‌యంలో ఢీ అంటే ఢీ అనే ప‌రిస్థితి వ‌స్తే.జ‌గ‌న్ పార్టీకి పెను ప్ర‌మాదం పొంచి ఉంది.

ఇక్క‌డ కావాల్సింది .ఢీ కాదు.లౌక్యం.

ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌ద‌ర్శిస్తున్న‌ది లౌక్య‌మే.! నిజానికి ఉండ‌వ‌ల్లి వ్యాఖ్య‌ల సారం గ్ర‌హిస్తే.జ‌గ‌న్‌ను ఎంత‌గా రెచ్చ‌గొట్టాలో.అంతా రెచ్చ‌గొట్టారు.ఇది ఒక వ్యూహం ప్ర‌కారం సాగింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఈ వ్యూహంలో జ‌గ‌న్ చిక్కుకుంటే.మొద‌టికే ప్ర‌మాదం పొంచి ఉంద‌నేది వాస్త‌వం అంటున్నారు వైసీపీ నేత‌లు.

సో.జ‌గ‌న్ ఈ సాహ‌సం చేసే ప్ర‌స‌క్తే క‌నిపించ‌డం లేద‌ని చెబుతున్నారు.

#UndavalliArun #ChiefMinister #Andhra Pradesh #YCP Leaders #UndavalliArun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ys Jagan Undavalli Arun Kumar Bjp Trap Related Telugu News,Photos/Pics,Images..