వారిని నమ్మి మోసపోతున్న జగన్ ? ఎంతగా అంటే ?

ఏపీ సీఎం జగన్ అన్ని విషయాల్లోనూ పనితీరును కనబరుస్తున్నా, కొన్ని కొన్ని విషయాల్లో వివాదాస్పధంగా వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి .ముఖ్యంగా రాజ్యాంగ సంస్థల విషయంలో జగన్ తప్పటడుగులు వేస్తున్నట్టు గా కనిపిస్తున్నారు.

 Ys Jagan Trouble On Officers Behavior-TeluguStop.com

మొదటి నుంచి జగన్ తీసుకున్న నిర్ణయాలు కానీ , కొన్ని కొన్ని పథకాలు అమలు కాని చూసుకుంటే,  వివాదాస్పదం అవుతుండడంతో పాటు, విపక్షాలు వాటిపై కోర్టుకు వెళ్లడం, కోర్టుల ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వెలువడుతుండడం వంటి వ్యవహారాలు ఏపీ ప్రభుత్వానికి చికాకు కలిగిస్తున్నాయి.ఏడాదిన్నర జగన్ పరిపాలన చూసుకుంటే , ప్రతి అంశము వివాదాస్పదంగా మారుతూ వస్తోంది.

అయితే ప్రతి సందర్భంలోనూ జగన్ అబాసుపాలు అవ్వడానికి కారణం కొంతమంది అధికారులే అన్న ఈ విషయం పైన చర్చ జరుగుతోంది.వారిని పూర్తిగా నమ్ముతూ వారు చెబుతున్న దానికి జగన్ సై అంటూ ముందుకు వెళుతుండటం వంటి కారణాలతో ఆయన కోర్టుల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారనే అభిప్రాయాలు అందరిలోనూ కలుగుతోంది.

 Ys Jagan Trouble On Officers Behavior-వారిని నమ్మి మోసపోతున్న జగన్ ఎంతగా అంటే -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జగన్ ఒక నిర్ణయం తీసుకునే ముందు కానీ, చట్టం చేసే ముందు కానీ, దాని యొక్క లోటు పాట్లను, కోర్టులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకునే విషయంలో జగన్ పూర్తిగా అధికారులపైనే ఆధారపడడం,  వారు నిర్ణయం మేరకు ముందుకు వెళుతున్న వంటి కారణాలతో ఆయన ప్రతి సందర్భంలోనూ కోర్టు చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోంది.నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ఎన్నికల అధికారిగా తప్పించి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా కొత్త ఎన్నికల కమిషనర్ ను జగన్ తీసుకొచ్చినా, అది మూడునాళ్ళ ముచ్చట గానే మిగిలిపోయింది.దీనిపై సుప్రీంకోర్టు తీర్పు నిమ్మగడ్డ కు అనుకూలంగా రావడంతో, మళ్లీ ఇక్కడే విధులు నిర్వర్తిస్తూ ఉండడం వంటి వ్యవహారాలు జగన్ ప్రభుత్వానికి చికాకు కలిగిస్తున్నాయి.ఇప్పుడు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే విషయంలో నూ నిమ్మగడ్డ జగన్ ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారారు.

Telugu Ap, Ap Politics, Chandrababu, Jagan Ruling, Justice Ramana Case, Nimmagadda Ramesh Kumar, Supreme Court, Tdp Govt, Ys Jagan, Ys Jagan In Trouble On Officers Behavior-Political

ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి జగన్ లేఖ రాయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.జగన్ కు ఎంత ధైర్యం ఉంటే ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కి వ్యతిరేకంగా వ్యవహరిస్తారనే  చర్చ జరిగింది.ఇదంతా అధికారులు జగన్ తప్పుదోవ పట్టించడమే కారణం అని చర్చ కూడా నడిచింది.కోర్టులు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి అనే విషయాన్ని అధికారులు జగన్ కు నూరిపోశారు అనే చర్చ సైతం జరిగింది.

ఇదిలా ఉంటే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏరికోరి కొంత మంది అధికారులను నియమించి వారి ద్వారా తనకు అనుకూలంగా ముందుకు తీసుకు వెళ్ళ వచ్చని భావించారు.

వారు మొదట్లో జగన్ కు అనుకూలంగా వ్యవహరించినా, ఆ తరువాత వారి వ్యవహార శైలి జగన్ కు నచ్చకపోవడం తో కొంత మంది అధికారులను తప్పించడం అలాగే కొంతమందికి జగన్ వ్యవహారశైలి నచ్చక వారు కేంద్ర సర్వీసులకు వెళ్ళి పోవడం వంటి వ్యవహారాలు నడిచాయి.గత టీడీపీ ప్రభుత్వం లో యాక్టివ్ గా పనిచేసిన అధికారులే చక్రం తిప్పుతున్నారు.ఈ విషయం జగన్ కు తెలిసినా ప్రత్యామ్నాయం కనిపించక వారితోనే పరిపాలనను సాగించల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఏరకంగా చూసినా, జగన్ కొన్ని కొన్ని విషయాల్లో తప్పటడుగులు వేస్తూ అభాసుపాలు అవుతున్నట్టుగా కనిపిస్తున్నారు.

#JusticeRamana #Supreme Court #Jagan Ruling #AP Politics #YS Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు