జగన్ సంచలన ప్రకటన..వేడెక్కిన ఏపీ రాజకీయం     2018-06-12   23:17:33  IST  Bhanu C

వైసీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి తన పంధా మార్చుకున్నారు..ఎంతో వ్యుహత్మకమైన నిర్ణయాలతో ఒక వైపు టీడీపీ ని దెబ్బ కొడుతూ మరో వైపు తన పార్టీకి మైలేజ్ పెరిగేలా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు..వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి ఆదిసగా అడుగులు వేస్తున్నారు..జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి నుంచీ తూర్పు గోదావరి జిల్లాలోకి తన పాదయత్రని ప్రారంభించే ముందు ఒక సంచలన ప్రకటన చేశారు..ఈ ప్రకటనతో టీడీపి పార్టీలో భారీ ప్రకంపనలు జరిగాయి..ఒక్క సారిగా చంద్రబాబు ఉలిక్కిపడ్డారు..ఇంతకీ ఏమిటా ప్రకటన అంటే..

వైసీపి పార్టీ లో ఇక నుంచి ఎమ్మెల్సీ స్థానాలన్నీ బీసీవర్గాలకే కేటాయిస్తాననీ ప్రజసంకల్పయాత్రలో ఆయన ప్రకటించారు…దాంతో టీడీపీ కి ఎంతో బలమైన ఓటు బ్యాంక్ అయిన బీసీ వర్గాలని తనవైపు తిప్పుకునే లా వ్యుహాలని సిద్డం చేశారని తెలుస్తోంది…వైసీపి అంటే కేవలం రెడ్డి వర్గానికే ఎక్కువ ప్రాధాన్య ఉంటుంది అంటూ టీడీపి ముందు నుంచీ ప్రచారం చేసుకుంటూ వస్తూ బీసీలని దూరం చేసే స్కెచ్ లు ఎన్నో వేసింది అయితే నిన్నటి జగన్ ప్రకటనతో ఒక్క సారిగా బీసీలకి వైసీపి పార్టీ పై ఒక క్లారిటీ వచ్చిందనే చెప్పాలి.