జగన్ సంచలన ప్రకటన..వేడెక్కిన ఏపీ రాజకీయం

వైసీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి తన పంధా మార్చుకున్నారు.ఎంతో వ్యుహత్మకమైన నిర్ణయాలతో ఒక వైపు టీడీపీ ని దెబ్బ కొడుతూ మరో వైపు తన పార్టీకి మైలేజ్ పెరిగేలా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 Ys Jagan Targets Bc Vote Bank-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి ఆదిసగా అడుగులు వేస్తున్నారు.జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి నుంచీ తూర్పు గోదావరి జిల్లాలోకి తన పాదయత్రని ప్రారంభించే ముందు ఒక సంచలన ప్రకటన చేశారు.

ఈ ప్రకటనతో టీడీపి పార్టీలో భారీ ప్రకంపనలు జరిగాయి.ఒక్క సారిగా చంద్రబాబు ఉలిక్కిపడ్డారు.

ఇంతకీ ఏమిటా ప్రకటన అంటే.

వైసీపి పార్టీ లో ఇక నుంచి ఎమ్మెల్సీ స్థానాలన్నీ బీసీవర్గాలకే కేటాయిస్తాననీ ప్రజసంకల్పయాత్రలో ఆయన ప్రకటించారు…దాంతో టీడీపీ కి ఎంతో బలమైన ఓటు బ్యాంక్ అయిన బీసీ వర్గాలని తనవైపు తిప్పుకునే లా వ్యుహాలని సిద్డం చేశారని తెలుస్తోంది…వైసీపి అంటే కేవలం రెడ్డి వర్గానికే ఎక్కువ ప్రాధాన్య ఉంటుంది అంటూ టీడీపి ముందు నుంచీ ప్రచారం చేసుకుంటూ వస్తూ బీసీలని దూరం చేసే స్కెచ్ లు ఎన్నో వేసింది అయితే నిన్నటి జగన్ ప్రకటనతో ఒక్క సారిగా బీసీలకి వైసీపి పార్టీ పై ఒక క్లారిటీ వచ్చిందనే చెప్పాలి.

పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం గౌడిపల్లి లో అకిరాస కులం సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ.వైసీపీ అధికారంలోకి వస్తే అకిరాస కులానికి ప్రత్యేక కార్పరేషన్ ఏర్పాటు చేస్తానని బీసీల సమస్యలను చట్టసభల్లో చర్చించి న్యాయం చేసేలా కృషి చేస్తానని తెలిపారు.

ఉభయగోదావరి జిల్లాలలో బీసీ ఓట్లు అధికంగా ఉంటాయి అయితే ఈ రెండు జిల్లాలపై వైసీపికి పట్టులేదు.దాంతో జగన్ వ్యుహత్మకంగానే ఈ నిర్ణయం ప్రకటించాడని అంటున్నారు విశ్లేషకులు.

ఇదిలాఉంటే జగన్ జపిస్తున్నబీసీ మంత్రంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పవని ఇప్పటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ ని తనవైపుకి తిప్పుకున్న జగన్ అటు కాపుల ఓట్లు ఎటూ పోకుండా ఇటు బీసీ ఓట్లు కి గురి పెట్టాడని.వచ్చే ఎన్నికల్లో గెలుపు ప్రభావం కేవలం కుల సమీకారణాలపై ఆధారపడి ఉంది కాబట్టి జగన్ ముందుగానే వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పవచ్చు అంటున్నారు పరిశీలకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube