జగన్ సొంత సర్వేలో ఇలా తేలిందా ? ఓహో  

Ys Jagan Survey Result-ys Jagan,yscp,జగన్

ఎదో చిన్నా చితకా గొడవలు తప్ప ఏపీలో ఎన్నికలయితే ప్రశాంతంగా జరిగినట్టే చెప్పుకోవాలి. ఆ ఎన్నికల రిజల్ట్ మాత్రం దగ్గర్లో కాకుండా దూరంగా జరిపేసారు అనే బాధ అన్ని పార్టీల్లో ఉంది. ఎందుకంటే అప్పటివరకు ఆ టెన్షన్ భరించడం ఎవరికీ సాధ్యం కావడంలేదు..

జగన్ సొంత సర్వేలో ఇలా తేలిందా ? ఓహో -Ys Jagan Survey Result

అందుకే ఎన్నికల ఫలితాలు వెలువడే మే 23 వ తేదీ కోసం ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో తమ పార్టీనే విజయం సాధిస్తుంది అంటే తమ పార్టీనే విజయం సాధిస్తుంది అని ధీమాగా చెబుతున్నారు. ఈ లోపునే అనేక జాతీయ సర్వేలు వైసీపీ పార్టీనే అధికారంలోకి వస్తుందని, జగనే సీఎం అవుతారని తేల్చేశాయి. కొన్ని సర్వేలు టీడీపీ అధికారంలోకి రావడం పక్కా అని తేల్చేశాయి.

ఈ కన్ఫ్యూజన్ అందరికి ఉత్కంఠ కలిగిస్తోంది. ఇక వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాజకీయాలు జగన్ కి బాగానే ఉపయోగపడ్డట్టే కనిపించింది. పీకే కూడా వైసీపీ ఎన్నికల ఫలితాల పై సర్వేలు జగన్ కు అందించింది.

అయితే పీకే అందించిన సర్వేలే కాకుండా జగన్‌కు సంబంధించిన సొంత టీమ్ సర్వేలు కూడా ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత చేసిన రిపోర్టులను జగన్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. జగన్ కు అందిన సర్వే రిపోర్టుల ప్రకారం వైసీపీ 80 కు పైగా అసెంబ్లీ స్థానాలను ఖచ్చితంగా గెలుస్తారని , కొన్ని సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుందని ఒక సర్వే లో తేలిందట. మరో సర్వే ప్రకారం 90కి పైగా సీట్లు వస్తాయని తేలిందట.

జగన్‌కు అందిన ఆరు సర్వేల్లో ఒక సర్వే లో అయితే వైసీపీ కి సుమారు 130 సీట్లు వస్తాయని తేలిందట. కాకపోతే జగన్ చేయించిన సొంత సర్వేలో మాత్రం ఆ పార్టీకి 117 నుంచి 120 సీట్ల లో గెలుపు జెండా రెపరెపలాడడం ఖాయం అని తేలిందట. జగన్ దగ్గర ఉండి తన టీమ్‌తో చేయించిన సర్వే కనుక ఈ సర్వేపై పార్టీ నాయకుల్లో మరింత నమ్మకం పెంచేసిందట. అయితే జగన్ కు సంబంధించి ఈ సర్వేల్లో ఇలా తేలితే అటు చంద్రబాబు కూడా ఒక పక్క ఈవీఎం ల మీద ఆరోపణలు చేస్తూనే తాము మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పేస్తున్నారు.

ఎవరికి వారు తమదంటే తమది అధికారం అంటూ సామాన్య జనాన్ని మాత్రం గందరగోళంలోకి నెట్టేస్తున్నారు.