ఇది అదిరిపోయే ప్లాన్ అంటే ? జగన్ తెలివి మాములుగా లేదు

కిందపడ్డా పైచేయి తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు.ఆ పార్టీ నాయకులను కట్టడి చేసేందుకు సీఎం జగన్ ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూనే వస్తున్నారు.

 Ys Jagan Supports Central Govt Decisions, Central Govt, Ys Jagan, Ycp, Bjp-TeluguStop.com

జగన్ అనుకున్నట్లుగానే ఆ పార్టీని బలహీనం చేసే విషయంలో సక్సెస్ అవుతూనే వస్తున్నాడు.పెద్దఎత్తున టిడిపిలోని నాయకులందరినీ చేర్చుకుంటూ, తెలుగుదేశం పార్టీని బలహీనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో పెద్ద ఎత్తున చేరికలు జరిగినా, ఆ తరువాత ఓవర్ లోడ్ అవుతుందనే కారణంతో ఆ చేరికలకు బ్రేకులు వేశారు.కానీ కొద్ది రోజులుగా మళ్లీ చేరికలు ఊపందుకున్నాయి.

ఒక్కో ఎమ్మెల్యే వైసీపీకి అనుబంధంగా కొనసాగేందుకు వస్తుండడం, తమ వారసులను, అనుచరులను అధికారికంగా వైసీపీలో చేర్చడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి.

వీరే కాకుండా పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయి కీలక నాయకులూ పార్టీలో చేరుతున్నారు.

వైసిపిలో నాయకుల సంఖ్య ఎక్కువ అయినట్టుగా కనిపిస్తుండడంతో ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున గ్రూపు తగాదాలు ఏర్పడుతూ, నిత్యం పార్టీకి తలనొప్పిగా మారింది.నియోజకవర్గాల్లో ఆధిపత్యపోరు పెరిగిపోతుండడంతో, నాయకులు బహిరంగంగానే రోడ్డెక్కి మరి రచ్చ చేసుకునే వరకు పరిస్థితి వచ్చింది.

జగన్ మాత్రం మరింత మంది టిడిపి నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తూ వస్తున్నారు.దీంతో జగన్ తీరుపై పార్టీలోనూ చర్చజరగుతోంది.ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా నాయకులు ఉన్నా, టిడిపికి చెందిన వారిని చేర్చుకోవడం అవసరమా అనే నిట్టూర్పులు పార్టీలో వస్తున్నా, జగన్ లెక్కచేయడం లేదు.

అయితే దీనంతటికీ కారణం లేకపోలేదు.

త్వరలోనే పునర్విభజన చట్టం ప్రకారం, ఏపీలో అసెంబ్లీ స్థానాలను పెంచుతారనే ధీమాలో జగన్ ఉన్నారు.ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలకు గానూ, మరో 50 నియోజకవర్గాలు పెరుగుతాయని జగన్ ఆశలు పెట్టుకున్నారు.అంటే మొత్తం 225 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి.2019 ఎన్నికలకు ముందే ఈ తతంగమంతా జరగాల్సి ఉన్నా, కేంద్రం పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో అది కాస్త వాయిదా పడింది.ప్రస్తుతం వైసీపీ బీజేపీ మధ్య సన్నిహిత వాతావరణం ఉండడంతో, జగన్ అడుగడుగున కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు ఇస్తూ ఉండడం వంటి కారణాలతో, నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే నమ్మకంతోనే ఈ చేరికలు ప్రోత్సహిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఇప్పటికే పలుమార్లు కేంద్ర బిజెపి పెద్దలను కలిసిన జగన్ ఈ విషయంపై స్పష్టమైన హామీ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube