జగన్ అనే నేను...అలా లేను...ఇలా ఉన్నాను!     2019-01-08   12:26:59  IST  Sai Mallula

వైసీపీ అధినేత జగన్ వ్యక్తిత్వం గురించి రాష్ట్ర రాజకీయాల్లో రకరకాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన అహంకారి అని… మొండి వాడు అని … తాను చెప్పిందే తప్ప ఎవరు ఏమి చెప్పినా వినిపించుకోడని … తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటూ…వితండవాదం చస్తాడు అనే అపవాదు ఆయన మీద అపవాదులు ఉన్నాయి.

YS Jagan Speech About What He Is-Chandrababu Naidu Elections In Ap Janasena Party Pawan Kalyan Janasena Tdp Ycp Ys

YS Jagan Speech About What He Is

అయితే ఈ విషయాలు అన్నింటిపైనా జగన్ తన అభిప్రాయాన్ని ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ చెప్పుకొచ్చాడు . జగన్ మొండి వాడు కాదని గట్టివాడిని తమ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని జగన్ చెప్పాడు. తాను మొండిగా ఏకపక్షంగా వెళ్తానని ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ ఉంటాయి… కానీ తన ఆ విధంగా వెళ్లనని పార్టీకి సంబంధించి ఏ నిర్ణయమైనా అందరితో కలిసి చర్చించి ఆ తర్వాత ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పుకున్నాడు.

అయితే దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా జగన్ వెల్లడించాడు. అసలు నేను నా ఇష్టం ప్రకారం నిర్ణయం తీసుకుని ఉంటే ఇప్పటికే అధికారంలోకి వచ్చి ఉండేవాడిని… అలా కాకుండా అందరి అభిప్రాయం తీసుకోబట్టే కొన్ని కొన్ని సార్లు వెనక్కి వెళ్లాల్సివచ్చిందని జగన్ అభిప్రాయపడ్డాడు. 2014 ఎన్నికల్లో బిజెపి టిడిపి తో కలవడానికి ముందే వైసీపీ తో రాయబారాలు నడిపిందని… వైసీపీ బీజేపీ పొత్తుకు సంబంధించి పార్టీ కీలక నాయకులు 25 మందిలో 23 మంది వ్యతిరేకించారని వారి అభిప్రాయం మేరకు బీజేపీతో కలవడానికి తాను విముఖత చూపించారు జగన్ చెప్పారు.

అప్పుడే గనుక బిజెపితో కలిసి ఉంటే ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉండే వాడిని కానీ నేను మాత్రం పార్టీలు నాయకుల అభిప్రాయం మాత్రమే ముఖ్యం అనుకున్నానని జగన్ ఆ ఇంటర్వ్యూ లో చెప్పాడు.

YS Jagan Speech About What He Is-Chandrababu Naidu Elections In Ap Janasena Party Pawan Kalyan Janasena Tdp Ycp Ys

అసలు ప్రాంతీయ పార్టీలు అనే వాటిని పరిగణలోకి తీసుకుంటే…. అక్కడ లీడర్ చుట్టూ రాజకీయం తిరుగుతుందని… వ్యక్తులను కాకుండా లీడర్ ని చూసి ప్రజలు ఓటు వేసే పరిస్థితి ఉంటుందన్నారు . అందుకే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ ని తీసుకున్న ఆ పార్టీ అధినేత నిర్ణయమే కీలకం అని… అతడు ఒక్కడే కీలక నిర్ణయాలు తీసుకుంటారని కానీ నేను మాత్రం దానికి భిన్నంగా పార్టీ నాయకులు అందరూ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్నతరువాతే … ఏదైనా నిర్ణయం ప్రకటిస్తానని జగన్ చెప్పుకున్నారు. అంతేకాకుండా పార్టీ లోని లోపాలు లాభనష్టాలపై తరచూ సీనియర్ నాయకులు అందరితోనూ చర్చిస్తానని చెప్పారు . ఇక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని…. తానేమీ నియంతలా వ్యవహరించడంలేదని ఇవన్నీ కావాలని వైసీపీ పై ప్రత్యర్థి పార్టీల నాయకులు చేస్తున్న విష ప్రచారం అని జగన్ వెల్లడించారు.