జగన్ ఇంత దెబ్బకొట్టాడేంటి ? అప్పటివరకు వీళ్ల పరిస్థితి ఏంటి ?  

Ys Jagan Special App On Elections Liquor Ban - Telugu Elections, Liquor Ban, Political News, Ys Jagan, Ys Jagan Special App On Elections

ఏపీలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీ సీఎం జగన్ ఏదో ఒక సంచలనం చేస్తూనే ఉన్నాడు.అదే సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా జగన్ ఎక్కడా వెనకాడడం లేదు.

 Ys Jagan Special App On Elections Liquor Ban

జగన్ అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయింది.ఈ తొమ్మిది నెలలు కనివిని ఎరుగని స్థాయిలో ఏపీలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడంతో పాటు, ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం విషయంలోనూ కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు.

ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలు అన్నిటినీ రద్దు చేసి, ప్రభుత్వమే వాటి నిర్వహించేలా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా మద్యం అమ్మకాలకు నిర్ణీత సమయం, పరిమితంగా అమ్మకాలు ఇలా ఎన్నో రూల్స్ పెట్టాడు.

జగన్ ఇంత దెబ్బకొట్టాడేంటి అప్పటివరకు వీళ్ల పరిస్థితి ఏంటి -Political-Telugu Tollywood Photo Image

ఇక ధరలు కూడా భారీగా పెంచి మందు తాగే వాళ్ళకి కిక్కు తిరిగిపోయేలా జగన్ వ్యవహరిస్తున్నారు.

ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి.

ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పాటు ఎన్నికల హడావుడి మొదలైపోయింది.ఇక ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం లేకుండా చూడాలని చూస్తున్న జగన్ దీనికోసం ప్రత్యేకంగా నిఘా అనే ఒక యాప్ ను కూడా తయారుచేయించి ప్రవేశపెట్టారు.

అయితే ఇక్కడే ఓ సమస్య వచ్చి పడింది.ప్రభుత్వ ఆధీనంలోని మద్యం షాపుల ద్వారా అమ్మకాలు చేస్తుండడంతో వీటిని ఏవిధంగా అరికడతారు అనే సందేహాలు మొదలయ్యాయి.

వేరే చోట నుంచి కూడా మధ్య తెచ్చి సీక్రెట్ గా పంపిణీ చేసే అవకాశం కూడా ఉండడంతో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఏపీలో మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేస్తే అసలు అక్రమ మద్యం అనే సమస్య రాదని జగన్ కు సలహాలు ఇస్తున్నారు.ప్రభుత్వం షాపులు మూసేసిన తరువాత ఏపీలో ఎక్కడా మద్యం బాటిల్ కనిపించినా అది అక్రమమే అవుతుంది.దీంతో అక్రమాలకు చెక్ పెట్టినట్లు అవుతుందని జగన్ భావిస్తున్నారు.

అసలు మద్యమే అమ్మడం లేదు కాబట్టి బయట నుంచి తేవాలి అనుకునేవాళ్ళు భయపడతారు.దొరికిపోతారు.

దీంతో ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.దీనిద్వారా నిబంధనల విషయంలో తాను ఎంత కఠినంగా ఉంటానో మరోసారి జగన్ నిరూపించుకునే అవకాశం ఏర్పడడంతో మద్యం దుకాణాల మూసివేత కు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

మళ్లీ ఎన్నికల ఫలితాలు తరువాత దుకాణాలను తెరవాలని చూస్తోంది.ఇది నిజంగా మందుబాబులకు ఆందోళన కలిగించే అంశమే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు