ఏపీలో ప్రతిపక్షాలది ఒక్కటే మాట

ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలన్నీ ఒక్కటే మాట మాట్లాడుతున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు వరదలతో నష్టపోయిన రైతులను పట్టించుకోవడంలేదని, వరద బాధితులను ఆడుకోవడంలేదని విమర్శలు గుప్పిస్తున్నాయి.

 Ys Jagan Slams Chandrababu For Ignoring Farmers Issues-TeluguStop.com

తాజాగా వైకాపా అధినేత జగన్ సీఎమ్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.బాబు రైతులను పట్టించుకోవడంలేదని, వరద ప్రాంతాల్లో పర్యటించలేదని అన్నారు.

ఇంతవరకు పంట నష్టం లెక్క తీయలేదని చెప్పారు.గోదావరి జిల్లాల్లో వరద బాధిత గ్రామాలను జగన్ సందర్శించారు.

ఆ గ్రామాల్లోని రైతులతో మాట్లాడారు.రైతులకు సహాయం చేయడంలో చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారని దుయ్యబట్టారు.

రైతులకు సహాయం చేసేవిధంగా తమ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు వస్తుందని అన్నారు.జగన్ ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రభుత్వాన్ని పొగడకూడదు.

కాబట్టి ఎప్పుడూ చేసినట్లే రొటీన్ విమర్శలు చేశారు.వరద ప్రాంతాల్లో బాబు పర్యటించారు.

వరద నష్టం అంచనాలు వేయడానికి కేంద్ర బృందం రాబోతున్నది.అధికారంలో జగనే ఉన్నాడనుకోండి చంద్రబాబు కూడా ఇలాంటి విమర్శలే చేస్తారు.

జగన్ పరిస్థితిని అద్యయనం చేసి విమర్శలు చేయలేదు.అలా విమర్శలు చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది.

కాబట్టి నాయకులు ఎవరైనా సరే అప్పటికప్పుడు ఏవో విమర్శలు చేస్తుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube