జగన్ కు అన్నీ ఇబ్బందులే… ఈ ఆరు నెలలు అన్నీ కష్టాలే ?  

Ys Jagan Six Months Ap Govt Salaries - Telugu Ap Cm, Ap Govt Salaries, Corona Effect, Six Months, Ys Jagan

ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఈ పది నెలల కాలంలో వైసీపీ అధినేత జగన్ ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూనే వస్తున్నాడు.ముఖ్యంగా జగన్ తీసుకున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదం కావడంతో పాటు ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల మెప్పు పొందడం ,ఇలా రెండు విషయాల్లోనూ దేశవ్యాప్తంగా జగన్ పేరు మార్మోగుతోంది.

 Ys Jagan Six Months Ap Govt Salaries

ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోయినా , తనతో కలుపుకొని151 మంది వైసీపీ శాసనసభ్యులు ఉండడంతో ఏపీ అసెంబ్లీ లో జగన్ తీసుకున్న నిర్ణయాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉంది.ఇంత వరకు బాగానే ఉన్నా, ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి ప్రస్తావించుకుంటే పీకల్లోతు కష్టాల్లో ఉందనే చెప్పాలి.

జగన్ అధికారం చేపట్టిన తర్వాత తాను ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నీ అమలు చేయడమే ప్రధాన విధిగా భావించి సంక్షేమ పథకాల అమలుకు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాడు.అనుకున్నట్టుగానే అన్ని హామీలను దాదాపుగా జగన్ ఈ పది నెలల కాలంలోనే అమలు చేశారనే చెప్పాలి.

జగన్ కు అన్నీ ఇబ్బందులే… ఈ ఆరు నెలలు అన్నీ కష్టాలే -Latest News-Telugu Tollywood Photo Image

అయితే అప్పటికే ఆర్థిక కష్టాల్లో సతమతమవుతున్న ఏపీ ఈ సంక్షేమ పథకాల ద్వారా మరింత ఇబ్బందులకు గురయ్యింది.

జగన్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు కారణంగా ఏపీకి పెట్టుబడుల ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది.

ఈ ఏడాది కాలంలో పెట్టుబడులు పెద్దగా రాలేదనే చెప్పాలి.ముఖ్యంగా మూడు రాజధానులు, శాసన మండలి రద్దు ఇలా అన్ని విషయాల్లో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు కారణంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది వెనకడుగు వేశారు.

ఈ విధంగా కష్టాలు పడుతున్న సమయంలోనే కరోనా వైరస్ ఎఫెక్ట్ జగన్ ప్రభుత్వానికి గట్టిగా తగిలినట్టు కనిపిస్తోంది.ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఏపి ప్రభుత్వం ఉన్నా, ఏదో రకంగా సగం జీతాలు అయితే చెల్లించారు.

పోనీ సంక్షేమ పథకాల అమలను కొంతకాలం పాటు వాయిదా వేయాలని చాలామంది సూచించినా జగన్ మాత్రం వాటిని నిలుపుదల చేసేందుకు ఇష్టపడడం లేదు.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం సహాయం కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది.

ఎందుకంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సమానంగా కేంద్రం సహాయం చేయాల్సి ఉంటుంది.ఈ తరుణంలో ఏపీకి ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం కనిపించడం లేదు.ఒక వైపు ఆర్థిక కష్టాలు, మరోవైపు కరోనా వైరస్ ఎఫెక్ట్ ఇవన్నీ ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నట్టు కనిపిస్తోంది.ఆరు నెలల కాలంలో ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా చాలా కష్టనష్టాలను ఎదుర్కొంటోంది.

మరి ఈ సమస్యల నుంచి జగన్ ఏ విధంగా గట్టెక్కుతారో అనే ఆందోళన వైసిపి నాయకులులోనూ ఎక్కువగా కనిపిస్తున్నా జగన్ మాత్రం ఈ విషయాల్లో పెద్దగా ఆందోళన లో ఉన్నట్లుగా కనిపించడం లేదు.కొంతకాలం పాటు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినా ఏదో ఒక రకంగా గట్టెక్కవచ్చు అనే ఆలోచనతో జగన్ ఉన్నట్లుగా ఆయన వ్యవహారం చూస్తుంటే అర్థమవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ys Jagan Six Months Ap Govt Salaries Related Telugu News,Photos/Pics,Images..