ఫ‌స్ట్ టైమ్‌.. ఆ మంత్రిపై జ‌గ‌న్ ఫైర‌య్యారా....?

“ఇప్పుడు మంత్రి కొడాలి నాని మాట్లాడ‌తారు“-అని అసెంబ్లీలో స్పీక‌ర్ సీతారాం ప్ర‌క‌టించిన అనేక సంద‌ర్భాల్లో సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా.“నేను కూడా ఆయ‌న మాట్లాడ‌డం కోస‌మే చూస్తున్నా… అవ‌కాశం ఇవ్వండి“ అంటూ.వ్యాఖ్యానించిన విష‌యం పార్టీలోను, ప్ర‌భుత్వంలోనూ నానికి జ‌గ‌న్ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో స్ప‌ష్టం చేసింది.క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాని.పార్టీలో కీల‌క ఐకాన్‌గా మారారు.ఆయ‌న‌కు అన్ని విధాలా జ‌గ‌న్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.

 For The First Time Jagan Fired On That Minister,jagan Mohan Reddy,andhra Pradesh-TeluguStop.com

టీడీపీపై దూకుడుగా విమ‌ర్శ‌లు చేస్తున్నా.అనేక సంద‌ర్భాల్లో ఆయ‌న పౌ‌రుషంగా వ్యాఖ్యానించినా.

పార్టీ కానీ, ప్ర‌భుత్వం కానీ.ప‌ట్టించుకోలేదు.

కానీ, ఇప్పుడు మాత్రం మంత్రి కొడాలిపై తొలిసారి సీఎం జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యార‌ని, ఆయ‌న త‌న వ్యాఖ్య‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌నే సందేశాన్ని పంపార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.తాజాగా మంత్రి కొడాలి నాని.

తిరుమ‌ల డిక్ల‌రేష‌న్ విష‌యంపై విప‌క్షాలు సీఎం జ‌గ‌న్ కేంద్రంగా చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను బ‌లంగా తిప్పికొట్టే ప్ర‌య‌త్నం చేశారు.అయితే, ఆయ‌న ఏకంగా ఈ విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విష‌యాన్ని ప్ర‌తిపాదించారు.

మోడీ ఏ భార్య‌తో క‌లిసి వెళ్లి.అయోధ్య రామ‌మందిరానికి శంకుస్థాప‌న చేశారంటూ.

పెద్ద విమ‌ర్శే చేశారు.

Telugu Andhra Pradesh, Kodali Nani, War, Times, Ysrcp-Telugu Political News

నిజానికి ఈ వ్యాఖ్య‌లు.బీజేపీ, టీడీపీ నేత‌ల నోటికి తాళం వేయించింది.డిక్ల‌రేష‌న్ విష‌యంలో అప్ప‌టి వ‌ర‌కు సీఎం జ‌గ‌న్‌ను, ఆయ‌న ఫ్యామిలీని టార్గెట్ చేసిన నేత‌లు.నాని వ్యాఖ్య‌ల‌తో డిఫెన్స్‌లో ప‌డ్డారు.అయితే… అదే స‌మ‌యంలో ఈ వ్యాఖ్య‌లు జాతీయ‌స్థాయిలో తీవ్ర మంట పుట్టించాయి.జాతీయ ప‌త్రిక‌లు కూడా ప్ర‌ధాన ఐటంగా దీనిని ప్ర‌చురించ‌డంతో.కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు కూడా నాని వ్య‌వ‌హారంపై సీరియ‌స్ అయ్యారు.దీనిపై రాష్ట్ర నేత‌ల నుంచి స‌మాచారం తెప్పించుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.ఇది రాజ‌కీయంగా మున్ముందు వైసీపీని బీజేపీ మ‌రింత‌గా టార్గెట్ చేసే  అవ‌కాశంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వాస్త‌వానికి కేంద్రం నుంచి ఏపీకి అనేక రూపాల్లో సాయం అందాల్సి ఉంది.వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలంటే.కేంద్రం నుంచి సాయం త‌ప్ప‌నిస‌రి.రాజ‌ధాని మార్పు, పోల‌వ‌రం, జిల్లాల ఏర్పాటు వంటి అనేక అంశాలు కేంద్రంతో ముడిప‌డి ఉన్నాయి.

ఇప్పుడు మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌తో కేంద్రంతో వైసీపీకి దూరం పెరిగితే.ఇన్నాళ్లు సానుకూలంగా ఉన్న వాతావ‌ర‌ణం చెడిపోయే ప్ర‌మాదం ఏర్ప‌డింద‌ని వైసీపీ నాయ‌కులు కూడా అంటున్నారు.

బ‌హుశ ఈ విష‌యాన్ని గ్ర‌హించిన సీఎం జ‌గ‌న్ .త‌న స‌ల‌హాదారు స‌జ్జ‌ల ద్వారా ప‌రోక్షంగా నానిని హెచ్చ‌రించే ప్ర‌య‌త్నం చేశార‌ని చ‌ర్చ సాగుతోంది.ఎన్ని వివాదాలు ఉన్నా.మోడీని వివాదాల్లోకి లాగ‌డం త‌ప్పేన‌ని స‌జ్జ‌ల వ్యాఖ్యానించ‌డాన్ని బ‌ట్టి.కొడాలిపై జ‌గ‌న్ సీరియ‌స్ గా ఉన్నార‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని అంటున్నారు  పార్టీ నేత‌లు.మున్ముందు ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube