వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా విద్యావ్యవస్థలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ సామాన్యులకు పిల్లల చదువు భారం కాకుండా సీఎం జగన్ పథకాల రూపంలో వారిని ఆదుకుంటూ ఉన్నారు.
“అమ్మ ఒడి” పథకం ద్వారా పిల్లల స్కూల్ ఫీజు విషయంలో తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తూ చదువు పేదవాడి కుటుంబానికి భారం కాకుండా చూస్తున్నారు.అంతేకాకుండా “నాడు-నేడు” కార్యక్రమం తో పాఠశాలలో అన్ని వసతులు ఉండేలా కూడా నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా స్కూల్స్ విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్ సర్కార్.మేటర్ లోకి వెళ్తే స్కూల్ కి ఒకరోజు స్టూడెంట్ హాజరు కాకపోతే వెంటనే విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ కి మెసేజ్ వెళ్లేలా సరికొత్త సిస్టం తీసుకురాబోతున్నారు.
ఇక రెండో రోజు కూడా హాజరు కాకపోతే సంబంధిత వాలెంటర్ స్టూడెంట్ యొక్క ఇంటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకొని దేనికి స్కూల్ కి రాలేదో కారణం తెలుసుకునేలా నిర్ణయాలు తీసుకున్నారు.పిల్లలను బడికి పంపించేలా.
తల్లిదండ్రులకు నచ్చజెప్పేలా బాధ్యతను గ్రామ సచివాలయలకు అనుసంధానం చేసి జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవడం జరిగింది.దీంతో తాజాగా జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో.
పిల్లల తల్లిదండ్రులతో పాటు చాలా మంది ప్రముఖులు.ఈ ఐడియా వర్క్ అవుట్ అయితే ఏపీలో నిరక్షరాస్యత రాబోయే రోజుల్లో పూర్తిగా కనుమరుగవడం గ్యారెంటీ అని అంటున్నారు.