కష్టమైన.. నష్టమైనా ! జగన్ ఇలా ఫిక్స్ అయ్యాడు అంతే !

రాజకీయ నాయకులకు విలువలు.విశ్వసనీయత చాలా ముఖ్యమని వైసీపీ అధినేత జగన్ ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు.

 Ys Jagan Said No To Ysrcp Jumping Mlas-TeluguStop.com

అందుకే ఎన్ని రాజకీయ ఒడిదుడుకులు ఎదురయినా తట్టుకుంటూ వాటిని పాటించేందుకు ప్రయత్నిస్తున్నాడు.అందుకే ఈ సారి టికెట్ల కేటాయింపులో ఎవరు ఎన్ని వత్తిళ్లు చేసినా అవేవి పట్టించుకోకుండా.

పార్టీ పై అభిమానం, నమ్మకం దీనికి తోడు సర్వే ఫలితాలు వీటిని ఆధారం చేసుకునే టికెట్ల కేటాయింపు చేయాలని నిర్ణయించుకున్నాడు.దీనికి కారణం గత అనుభవాలేనని తెలుస్తోంది.

గత ఎన్నికల్లో తాను నమ్మి టిక్కెట్ ఇస్తే కష్టకాలంలో పక్కన ఉండకుండా వెళ్లిపోయారన్న ఆవేదన, ఆగ్రహం జగన్ లో ఇప్పటికీ కనిపిస్తోంది.ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ఆఫరేషన్ ఆకర్ష్ ద్వారా .23 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారడం జగన్ ను కలచివేసిందంటున్నారు.భూమా నాగిరెడ్డి కుటుంబం పార్టీని వీడినప్పుడు ఆయన తీవ్రంగా ఆవేదన చెందారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

తమ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేయడమే కాకుండా వారికి మంత్రి పదవులు ఇవ్వడంతో జగన్ మరింత నొచ్చుకున్నారని, అందుకే ఆయన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని జగన్ సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది.

అందుకు ప్రధాన కారణం బీజేపీ, జనసేన, టీడీపీ కాంబినేషన్ ప్రధాన కారణమన్నది అందరికీ తెలిసిందే.అయితే ఈ సారి అటువంటి పొరపాటు జరగకుండా వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల స్క్రీనింగ్ కూడా అలాగే చేయాలని జగన్ నిర్ణయించారు.

ఇటీవల కొందరు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తామని సందేశాలను పంపినా జగన్ నిర్మొహమాటంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు.ప్రకాశం జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు, కడప, కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో ఇమడలేక పోతున్నామని, తిరిగి పార్టీలోకి వస్తామని రాయబారం పంపినా జగన్ స్పందించలేదు.

ఒకసారి వెళ్లిన వారిని ఇక చేర్చుకునేది లేదని, అలా చేర్చుకుంటే టీడీపీ, వైసీపీకి తేడా ఏముంటుందనే లాజిక్ చెప్తున్నాడు జగన్ .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube