వైసీపీ వ్యూహాలు లీక్..వారిపనేనా..???

ఏపీలో ఇప్పుడు రాజకీయాలు రంజుగా మారుతున్నాయి.వైసీపీకి పూర్తి స్థాయిలో ప్రజా మద్దతు ఉందంటూ పలు సర్వేలు సైతం గతంనుంచీ నివేదికలు ఇస్తుండటంతో అధికార టీడీపీ నుంచీ వలసలు పెరిగిపోతున్నాయి.

 Ys Jagan Reveals Tdp Coverts In Ycp-TeluguStop.com

ఈ నేపధ్యంలోనే ఒక్క సారిగా వైసీపీలో కలవరం మొదలయ్యింది.పార్టీలో వస్తున్న చేరికలలో కోవర్టులు ఉన్నారా అనే అనుమానాలు కీలకనేతలు లేవనెత్తారు.టీడీపీ పన్నిన వ్యూహంతో వ్యుహంతోనే ఇది జరుగుతుందని వైసేపీ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది…ఇదిలాఉంటే

ఈ నేపధ్యంలో వైసీపీ ప్రజలలోకి వెళ్ళడానికి, వైసీపీ పై మరింత నమ్మకం పెంచుకోవడానికి జనాకర్ష పధకాల రూపకల్పన, వ్యూహ ప్రతి వ్యుహాలని పార్టీలోకొంతమందితో సమావేశం ఏర్పాటు చేసి చర్చించింది.అందుకు గాను “బిసి గర్జన” ఏర్పాటు చేసి బిసి నేతలని , బీసీ ఓట్లని తమవైపుకు తిప్పుకోవాలని ప్రయత్నాలు చేసింది.అందుకుగాను ఫిబ్రవరి నెలనని ఎంచుకున్నారు.కాని ఇంతలో ఈ వార్త కోవర్టుల రూపంలో

అధికార పార్టీకి చేరిపోవడంతో ఒక్క సారిగా బాబు తన వ్యుహలని మార్చుకుని, వెనువెంటనే రాజమండ్రిలో “జయహో బిసి పబ్లిక్” అంటూ ఒక సభని ఏర్పాటు చేసి బిసిలకు వరాల జల్లు కురిపించారు.

ఈ పరిణామాలతో ఒక్క సారిగా వైసీపీ నేతలు ఖంగుతిన్నారు.తాము ముందే అనుకున్న వ్యూహాలు తెలియబట్టే టీడీపీ ఈరకమైన హామీలు కురిపించింది తెలుసుకున్నారు.ఆ సమయం నుంచీ వైసీపీకి కోవర్టుల భయం పట్టుకుంది.

“బీసి గర్జన” ఏర్పాటు చేయాలని ఎంతో రహస్యంగా కీలక సమావేశం ఏర్పాటు చేసినా సరే ఈ విషయం ఎలా బయటకి వెళ్ళింది అనే కోణంలో ఆరా తీస్తున్నారట.అయితే ఈ విషయంలో ఊరుకుంటే ప్రజలు తమని మర్చిపోయి బాబు కి ఎక్కడ పట్టం కడుతారో అని భయపడుతున్న వైసీపీ త్వరలో ప్రజలలోకి వెళ్లి , తమనుంచీ టీడీపీ పధకాలు ఎలా కాపీ కొట్టి ప్రజలని మభ్యపెడుతుందో తెలుపనున్నారట.ఏది ఏమైనా వైసీపీలో కోవర్టుల కలకం జగన్ ని నిట్టా ముంచేయడం ఖాయం అంటున్నారు రాజకీయ పండితులు.

మరి ఈ కోవర్టులకి , టీడీపీ వ్యుహలకి జగన్ ఎలా చెక్ పెడుతారో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube