అమరావతి ప్రాజెక్టుల్లో కదలిక ? జగన్ లో ఇంత మార్పు ఎందుకు ?  

Ys Jagan Restar Amaravati Projects - Telugu Amaravati Lands, Amaravati Projects, Ap Govt, Chandrababu, Tdp, Ys Jagan

అమరావతి పేరు చెబితే వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కు గుర్తుకువచ్చేది చంద్రబాబు, ఆయన పార్టీ తెలుగుదేశం.అమరావతి పేరు చెప్పుకుని టిడిపి బాగా లబ్ధి పొందిందని, ఆ పార్టీ నాయకులు బాగా వెనకేసుకున్నారనీ, ముఖ్యంగా తక్కువ ధరకు ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి, ఎక్కువ ధరకు అమ్ముకోవాలని ప్రయత్నించాలని చూశారని, అందుకే గత టీడీపీ ప్రభుత్వం అమరావతి పూర్తిగా ఫోకస్ పెట్టింది అనేది జగన్ అభిప్రాయం.

 Ys Jagan Restar Amaravati Projects

దాని కారణంగానే తాను అధికారంలోకి రాగానే అమరావతి ప్రాజెక్టు ను పూర్తిగా పక్కన పెట్టేసి మూడు రాజధానులు అంటూ ప్రకటించారు జగన్.విశాఖను రాజధానిగా నిర్ణయించి ఆ మేరకు అక్కడకు రాజధాని తరలించాలని గట్టి ప్రయత్నాలు చేశారు.

అయితే ప్రస్తుతం ఆ వ్యవహారం కోర్టులో పెండింగ్ లో ఉండడంతో వేచి చూస్తున్నారు.

అమరావతి ప్రాజెక్టుల్లో కదలిక జగన్ లో ఇంత మార్పు ఎందుకు -Political-Telugu Tollywood Photo Image

కానీ హఠాత్తుగా ఇప్పుడు అమరావతిలో మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచార.అంటే 70 శాతం నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులు తక్షణమే పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఇంత అకస్మాత్తుగా వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అనేది ఎవరికీ ఇప్పుడు అంతుపట్టడం లేదు.

విశాఖ ను రాజధానిగా జగన్ నిర్ణయించడంతో అక్కడ శరవేగంగా పనులు కూడా జరిగిపోతున్నాయి.కోర్టులో ఈ అంశం పెండింగ్ లో ఉండడం కారణంగానే జగన్ కాస్త వెనక్కి తగ్గుతున్నారు.

మళ్ళీ ఇప్పుడు అమరావతి పై జగన్ ఎందుకు మొగ్గుచూపుతున్నారనే విషయం ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది.

ప్రస్తుతం అమరావతిలో 70 శాతం పూర్తయిన భవనాలను పూర్తిచేస్తే ఉద్యోగులకు, ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ అందుబాటులోకి వస్తాయి.

అలా అని వీటన్నిటిని పూర్తిచేస్తే వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు వస్తాయి.ఇక్కడ నిర్మాణాలను పూర్తి చేసి మళ్ళీ విశాఖలో నిర్మాణాలు చేపట్టడంపైన అందరూ వేలెత్తి చూపే అవకాశం ఉంది.

అయినా ఇవన్నీ లెక్క చేయకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణాలు ఏంటి అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ys Jagan Restar Amaravati Projects Related Telugu News,Photos/Pics,Images..

footer-test