పీకే కు జగన్ పిలుపు ఆ బాధ్యతలు అప్పగింత ?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఘన విజయం సాధించిందంటే, ఆ ఘనత జగన్ ఒక్కడిదే కాదు.అందులో ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త శ్రమ కూడా ఎక్కువగానే ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే.

 Ys Jagan, Prashanth Kishore, Ycp Govt, Ys Jagan Plan With Prashant Kishore-TeluguStop.com

జగన్, ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు వైసీపీకి బాగా కలిసి వచ్చాయి.పికే డైరెక్షన్ లో జగన్ ప్రచారాన్ని చేపట్టి, ఎన్నో కీలక నిర్ణయాలు, ఎన్నికల హామీలను జగన్ తో ఇప్పించడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర చెప్పలేనిది.151 సీట్లతో ఏపీలో, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, తెలుగుదేశం పార్టీ 23 సీట్లతో మట్టి కరవడానికి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు ఎంతగానో పని చేశాయి.అందుకే జగన్ ఇప్పటికీ ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.

ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రశాంత్ కిషోర్ టీమ్ తో జగన్ కు పని లేకుండా అయిపోయింది.

కానీ వైసిపి ప్రభుత్వం ఏర్పడే ఏడాదయ్యింది.

జగన్ ఈ సందర్భంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి, ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.కానీ క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పాలన గురించి జనాలు ఏమనుకుంటున్నారో అనే విషయం జగన్ ఆరా తీస్తూ వస్తున్నా, సరైన విధంగా రిజల్ట్ రావడం లేదట.దీంతో ఇప్పటి వరకు వివిధ సంక్షేమ పథకాల కింద ఈ ఏడాది కాలంలో లబ్ధిపొందిన 3.5 కోట్ల మంది లబ్ధిదారులు సంతృప్తి చెందారా లేదా ? ఇంకా ఎటువంటి అసంతృప్తి ఉంది అనే అనేక అంశాల గురించి జగన్ వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రశాంత్ కిషోర్ టీమ్ ను రంగంలోకి దించబోటున్నట్టు తెలుస్తోంది.ప్రశాంత్ కిషోర్ తో ఈ మేరకు చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం.నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పథకాలు, ప్రజల అభిప్రాయం తెలుసుకునే విధంగా పికె టీమ్ రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం.

Telugu Ycp, Ys Jagan, Ysjagan-Telugu Political News

అలాగే ఇసుక, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, ఇళ్ల స్థలాల పంపిణీ వంటి అంశాలపై వైసీపీ ప్రభుత్వం ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తనకు రిపోర్ట్ రూపంలో అందించాల్సిందిగా జగన్ ప్రశాంత్ కిషోర్ కు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.2019 ఎన్నికలకు ముందే ఎమ్మెల్యేలు, ఎంపీలు గా ఎవర్ని రంగంలోకి దించాలనే విషయంపైన ప్రశాంత్ కిషోర్ సమగ్రంగా సర్వే చేసింది.ఆ మేరకు సీట్ల కేటాయింపులు జరగ్గా, ఖచ్చితమైన రిజల్ట్ రావడంతో అప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ టీం పై జగన్ కు నమ్మకం బాగా పెరిగింది.ఇప్పుడు ఈ బాధ్యతలు అప్పగిస్తే ఉండడంతో ఆయన ఏ రిపోర్ట్ ఇస్తారనేది ఆసక్తి గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube