జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్పం ఇక్క‌డితో ఆగ‌దు..       2018-06-27   06:25:13  IST  Bhanu C

అవును! ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌పేరుతో జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర కు నేటితో 200ల రోజులు పూర్తి చేసుకున్నాయి. ఆయ‌న ఎక్క‌డ అడుగు పెడితే.. అక్క‌డ ప్ర‌జ‌లు జ‌న‌హార‌తులు ప‌డుతున్నారు. వారి స‌మ‌స్య‌లు చెప్పుకొంటున్నారు. ప్ర‌భుత్వ పాల‌న‌లో త‌మ‌కు జ‌రుగుతున్న దాష్టీకాన్ని వివ‌రిస్తున్నారు. త‌మ‌కు ఆద‌రువు ఇవ్వాల‌ని కోరుతున్నారు. గ‌త ఏడాది న‌వంబ‌రులో ప్రారంభ‌మైన ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌కు ఎక్క‌డా లేని జ‌నాలు హాజ‌రువుతున్నారు. వారు ఒక్క త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు మాత్ర‌మే కాదు.. జ‌గ‌న్‌ను దీవించేందుకు కూడా వ‌స్తున్నారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాట‌వ్వాల‌ని కోరుతున్నారు. వృద్ధులు, విక‌లాంగులు, మ‌హిళ‌లు, విద్యార్థులు, చేతివృత్తుల వారు ఇలా ఒక్క‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. స‌మాజంలోని స‌హ‌స్ర‌వృత్తుల వారు జ‌గ‌న్‌ను ఆశీర్వ‌దిస్తున్నారు. ఇక‌, జ‌గ‌న్ ప్రారంభించిన ఈ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌. ఇక్క‌డితో ఆగిపోయేది కాదు. ప్ర‌జాక్షేమం కోసం, ప్ర‌జ‌ల కోసం ఆయ‌న ప్రారంభించిన ఈ యాత్ర 3000 కిలో మీట‌ర్ల త‌రువాత ఆగినా.. మ‌రో ప‌దిహేను రోజుల విరామంతో మ‌ళ్లీ బ‌స్సు యాత్ర‌కు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. దీనికి సంబంధించి పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తు న్నార‌ని, రోడ్ మ్యాప్ త‌యారు చేస్తున్నార‌ని తెలుస్తోంది.

పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌వ‌ర్ చేయ‌నిప్రాంతాలు, న‌గ‌రాల‌ను ఈ బ‌స్సు యాత్ర‌లో క‌వ‌ర్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు., మొత్తంగా ఇదికూడా 3000 కిలో మీట‌ర్లు ఉంటుం ద‌ని అంటున్నారు. అయితే, దీనిని ఎప్పుడు ప్రారంభించాల‌నే విష‌యంపై నిర్ణ‌యానికి రాలేదు. పాద‌యాత్ర ముగిసిన వారం ప‌దిరోజుల్లోనే దీనికి ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నార‌ని స‌మాచారం. ఇక‌, పాద‌యాత్ర విష‌యానికి వ‌స్తే.. జ‌గన్‌ వేస్తున్న ఒక్కో అడుగుపై జనం ఆశలు పెంచుకుంటున్నారు. తమను కష్టాల ఊబి నుంచి గట్టెక్కించే తీరం వైపు ఆ అడుగులు సాగుతున్నాయని వారు బలంగా నమ్ముతున్నారు.

ఏఎన్‌ఎంలు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు, రైతులు, నిరుద్యోగులు.. ఇలా వివిధ వర్గాల వారు జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పూర్తయిన పాదయాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. ఈ జిల్లాల్లో అడుగడుగునా జనాభిమానం వెల్లువెత్తింది. ఇసుక వేస్తే రాలనంతగా బహిరంగ సభలు కిటకిటలాడాయి. ఈ సభల్లో జగన్‌ ప్రసంగం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఒక జిల్లాతో మరో జిల్లా పోటీపడుతోందా అన్నట్లు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పాదయాత్ర టీడీపీలో గుబులు రేపుతుండ‌డం గ‌మ‌నార్హం .