జగన్ ఎప్పటికీ సీఎం అవ్వలేడా..రీజన్ ఇదేనా   YS Jagan Political Future     2018-04-02   06:45:44  IST  Bhanu C

2019 ఎన్నికలు ఎంతో రసవత్తరంగా సాగనున్నాయి ఈ విషయం ప్రస్తుత రాజకీయ పరిస్థితులని పరిశీలించే ఎవరికైనా సరే అర్థం అవుతంది..గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ,బిజెపి సప్పోర్ట్ తో అందలం ఎక్కిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో సైతం అధికారంలోకి రావాలని వ్యూహాలు పన్నుతున్నారు..ఇదిలాఉంటే జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో వెంట్రుక వాసిలో అధికారాన్ని కోల్పోయాడు అందుకే ఈ సారి ఎలా అయినా సరే అధికారాన్ని దక్కించుకోవాలనే విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు..ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎన్నిక‌లు ఏడాదిన్న‌ర ఉండ‌గానే ప్ర‌జ‌ల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. పాద‌యాత్ర పేరుతో గ్రామాలను చుట్టి వ‌స్తున్నారు..అక్కడ ఉన్న బలమైన నేతలని తనవైపు తప్పుకుంటున్నారు..
-

ఇప్ప‌టికే 125 రోజులుగా ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌ను పూర్తి చేసుకున్న జగన్ ఉన్న ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ భవిష్యత్తు కార్యాచరణ రూపొందిచుకుంటున్నారు.. ఏపీకి ప్ర‌త్యేక హోదా, ప్ర‌త్యేక ప్యాకేజీ, నిధులు, అనుమ‌తులు వంటి వాటి విష‌యంలో కేంద్రంపై పోరు కూడా చేస్తున్నారు. ఇప్ప‌టికే అవిశ్వాసం ప్ర‌క‌టించారు. మ‌రో నాలుగు రోజులు ఆగితే.. త‌న ఎంపీల‌తో రాజీనామా కూడా చేయిస్తారు. ఈ ప‌రిణామాల‌న్ని టి వెనుక కేవ‌లం వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ వేస్తున్న అడుగులు. కానీ ఈ పరిస్థితులలో..జగన్ చేస్తున్న డ్రామాల ద్వారా విజయాన్ని సొంతం చేసుకోవడం ఎంత సులభమైన మార్గామేనా..? ప్రజలకి కావాల్సింది సింపతీనా ..? లేక అభివృద్ధి చేసేవాళ్ళు కావాలా అనేది ఇప్పుడు ప్రధానమైన అంశం..

అయితే ప్రస్తుత పరిస్థితులని గమనిస్తున్న ఎపీ ప్రజలు అనుభవానికే పెద్ద పీట వేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు బిజెపి చేసిన ఇన్నర్ సర్వేలో సైతం ఏపీ ప్రజలు జగన్ పై వ్యతిరేకత చూపిస్తున్నారని తేలిందట..ఇప్ప‌టికే అనేక చిక్కుల్లో ఉన్న ఎపీని చంద్రబాబు కొంత మేర కేంద్రం సహకారం లేకుండానే గట్టెక్కించారు..అయితే ఏపీ ఇంకా ఆర్థికంగా కోలుకుని, అభివృద్ధి బాట ప‌ట్టేందుకు మ‌రో పాతికేళ్ల స‌మ‌యం పడుతుంది ఇలాంటి సమయంలో ఏపీ అభివృద్ధి విషయంలో దృష్టి పెట్టుకుని అనుభవం ఉన్న చంద్రబాబు కే పట్టం కడితేనే భవిష్యత్తు తరాలకి న్యాయం జరిగేలా లేదనేది ఏపీ పజల అభిప్రాయం..ఈ క్ర‌మ‌లోనే జ‌గ‌న్‌ను వారు సీఎంగా అంగీక‌రించ‌డం లేద‌ని తెలుస్తోంది..పోను పోను టిడిపి గనుకా ఇదే కోణంలో ప్రచారం చేసుకోగలిగితే తప్పకుండా జగన్ ఓటమి ఖాయమని విశ్లేషకులు సైతం అంటున్నారు..