జ‌గ‌న్ ముందున్న అగ్ని ప‌రీక్ష ఇదొక్క‌టే... హిట్టా... ఫ‌ట్టా...!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి 151 సీట్ల బంప‌ర్ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చేశారు.అయితే ఆయ‌న‌కు ఆ ఆనందం మూన్నాళ్ల ముచ్చ‌ట‌గానే మిగిలింది.జ‌గ‌న్ సీఎం అయిన‌ప్పుడు రాష్ట్ర ఖ‌జానాలో చంద్ర‌బాబు కేవ‌లం రు.130 కోట్లు మాత్ర‌మే ఉంచి దిగిపోయారు.అప్ప‌టి నుంచి రాష్ట్ర లోటు బ‌డ్జెట్  రోజు రోజుకు పెరిగిపోతోంది.జ‌గ‌న్ మిగిలివ‌న్నీ ఏదోలా నెట్టుకొస్తున్నా పోల‌వ‌రం ప్రాజెక్టు మాత్రం మ‌నోడికి అగ్నిప‌రీక్ష‌గా మారింది.కేంద్రం స‌హ‌కారం ఉంటే త‌ప్పా పోల‌వ‌రం విష‌యంలో జ‌గ‌న్ ఏం చేయ‌లేని ప‌రిస్థితి.
పెరిగిన అంచ‌నాల మేర‌కు తాము నిధులు ఇచ్చే ప్ర‌శ‌క్తే లేద‌ని కేంద్రం కుండ‌బ‌ద్ద‌లు కొడుతోంది.

 Ys Jagan Decision On Polavaram Issue, Pm Modi, Polavaram Issue, Ap People, Ys Ja-TeluguStop.com

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన స‌హకారం ఏ మాత్రం లేక‌పోయినా జ‌గ‌న్ మాత్రం మోడీకి చిన్న విష‌యంలో కూడా మ‌ద్ద‌తు ఇస్తున్నారు.అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరగా కేంద్రంలోకి మోడీతో జగన్ దోస్తీ చేస్తున్నారు.

రాజ్యసభలో బిల్లులకు కళ్ళు మూసుకుని మద్దతు ఇస్తున్నారు.క‌నీసం బీజేపీ వాళ్లు జ‌గ‌న్‌ను మ‌ద్ద‌తు అడ‌గ‌కుండానే ముందే జ‌గ‌న్ సాగిల‌ప‌డుతోన్న ప‌రిస్థితి.

Telugu Andhra Pradesh, Chandra Babu, Jagan-Telugu Political News

ఏదెలా ఉన్నా కీల‌క‌మైన పోల‌వ‌రం విష‌యంలో జ‌గ‌న్ కేంద్రం నుంచి నిధులు రాబ‌ట్టుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లోపు పూర్తి చేయ‌ని ప‌క్షంలో జ‌గ‌న్ ఏపీ ప్ర‌జ‌ల దృష్టిలో మైన‌స్ కాక‌త‌ప్ప‌దు.మోడీ దేశ‌వ్యాప్తంగా ఎంతోమందిని న‌మ్మించి దెబ్బేశాడు.అలాంటి మోడీకి జ‌గ‌న్‌ను న‌మ్మించి దెబ్బేయ‌డం పెద్ద క‌ష్టం కాదు.ఇప్ప‌టికే ఏపీకి ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వు అన్న‌ట్టుగా జ‌గ‌న్ కోర్టుల‌తో ఢీ అంటే ఢీ అంటున్నాడు.

అస‌లే ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రం.ఇలాంటి టైంలో జ‌గ‌న్ మోడీని ఢీ కొట్టి పోల‌వ‌రం ఎంత వ‌ర‌కు సాధించి పూర్తి చేస్తారు ? అన్న‌ది పెద్ద స‌వాలే.
పోల‌వ‌రం విష‌యంలో జ‌గ‌న్ స‌క్సెస్ అయితే సూప‌ర్ హిట్ అయినట్టే.లేనిప‌క్షంలో జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప్ర‌జాక్షేత్రంలో పోల‌వ‌రం విష‌యంలో ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పుకోలేని ప‌రిస్థితి ఉంటుంద‌న్న‌ది మాత్రం వాస్త‌వం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube