విధుల్లో బిజీ గా ఉన్నందున వ్యక్తిగత హాజరు కు మినహాయింపు కోరిన ఏపీ సీఎం  

Ys Jagan Petition To Cbi Court-ap Cm Ys Jagan,chandrababu Naidu,janasena,pawan Kalyan Janasena,tdp,ys Jagan,ys Jagan Petition,ysrcp

ఏపీ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.ఏపీ సీఎంగా అధికారిక భాద్యతలు స్వీకరించినందున ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ ఆ పిటీషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తుంది.

Ys Jagan Petition To Cbi Court-ap Cm Ys Jagan,chandrababu Naidu,janasena,pawan Kalyan Janasena,tdp,ys Jagan,ys Jagan Petition,ysrcp-YS Jagan Petition To CBI Court-Ap Cm Ys Chandrababu Naidu Janasena Pawan Kalyan Janasena Tdp Ys Ysrcp

ఏపీ సీఎంగా అధికారిక విధుల్లో బిజీగా ఉన్నందున ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు జగన్, తన తరఫున న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని ఆ పిటీషన్ ద్వారా విన్నవించుకున్నారు.తాను సీఎం బాధ్యతల్లో ఉన్నందున అధికారిక వ్యవహారాల్లో పాల్గొనాలి.ఎక్కు వ సమయం పరిపాలనకు కేటాయించాలన్న కారణంగా కోర్టుకు హాజరుకావడం ఇబ్బందిగా ఉన్నట్లు తెలిపారు.

Ys Jagan Petition To Cbi Court-ap Cm Ys Jagan,chandrababu Naidu,janasena,pawan Kalyan Janasena,tdp,ys Jagan,ys Jagan Petition,ysrcp-YS Jagan Petition To CBI Court-Ap Cm Ys Chandrababu Naidu Janasena Pawan Kalyan Janasena Tdp Ys Ysrcp

తాను తరచుగా హైదరాబాద్‌లో కోర్టు విచారణకు హాజరుకావడం వల్ల పరిపాలన దెబ్బతినే అవకాశం ఉందని అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదని కావున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆ పిటీషన్ లో కోరినట్లు తెలుస్తుంది.

అయితే, తన వ్యక్తిగత హాజరు తప్పనిసరిగా అవసరమని కోర్టు భావిస్తే మాత్రం ఆదేశించినప్పుడల్లా కోర్టుకు హాజరవుతానని తన పిటీషన్ లో పేర్కొన్నారు.అయితే సీఎం జగన్ పెట్టిన ఈ పిటిషన్‌పై కాసేపట్లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరగనుంది.

దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది.