2019 ఎన్నికల్లో గెలుపుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ధీమాగా ఉన్నారు..ఈ సారి ఏపీలో వైసీపీ గెలుపుతో చరిత్ర సృష్టించడానికి సిద్దంగా ఉన్నామని చంద్రబాబు కి ఘోరమైన పరాభవం తప్పదని, వైసీపీ గెలుపు ఏపీ చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు జగన్ మోహన్ రెడ్డి..ఎన్నడూ లేనంతగా ఇంత బల్లగుద్ది చెప్పడానికి కారణం ఏమిటనేది ఇప్పుడు అందరిలో ఉత్ఖంతని రేకెత్తిస్తోంది..ఒక జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు..గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
ఈసారి ఏపీలో గెలుపొందిన పార్టీ కేంద్రంలో చక్రం తిప్పుతుందని ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు..ఇదే విషయాన్ని జగన్ కూడా ప్రస్తావించారు ఈ సారి ఢిల్లీ లో చక్రం తిప్పే ఏకైక ప్రాంతీయ పార్టీ వైసీపీ నే అని తేల్చి చెప్పారు..ఏపీలో వచ్చే ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగా సాగుతాయని 2014 నాటికి చంద్రబాబు, తానూ ఇద్దరం అధికారంలో లేమని..అప్పట్లో కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత మా రెండు పార్టీలు పంచుకున్నాయని అయితే ఈ సారి టీడీపీ పై ఉన్న వ్యతిరేకత ఓటింగ్ మాకు తప్పకుండా కలిసి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు..
అయితే గత ఎన్నికల్లో అధికారం కోల్పోవడానికి కారణం జనసేన ,బీజేపీ లు బాబు కి మద్దతు తెలుపడమేనని అయితే ఈ సారి ఆ పరిస్థితి ఏపీలో లేదని చంద్రబాబు కి బీజేపీ ,పవన్ కళ్యాణ్ దూరం అవ్వడంతో తమ గెలుపు సునాయసనం అయ్యిందని జగన్ తెలిపారు…హామీలు నెరవేర్చని బాబు సర్కార్ గోతిలో కప్పెట్టడం ఖాయమని అందుకు ప్రజలు కూడా సిద్దంగా ఉన్నారని తెలిపారు జగన్..వచ్చే ఎన్నికలలో తాము ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు గెలుచుకోబోతున్నామని ఆయన చెప్పారు.
పనిలో పనిగా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో పొత్తుల విషయంపై కూడా జగన్ క్లారిటీ ఇచ్చేశారు..ఎపీకి ఎవరు ప్రత్యెక హోదా ఇస్తే ఆ పార్టీకి మాత్రమే మా మద్దతు ఉంటుందని జగన్ తెగేసి చెప్పారు..ఏపీ విషయానికి వస్తే హంగ్ వచ్చే సమస్యే లేదని..ఏపీ జనం ఏకపక్షంగా వైసీపీని కోరుకుంటారని జోస్యం చెప్పారు జగన్ రెడ్డి..మాకు గెలుపు విషయంలో ధీమా లేదని..చంద్రబాబు అంటున్నట్టుగా నాకు అనుభవం బాబు అంత లేకపోవచ్చు కానీ నా తండ్రిలా కమిట్ట్మేంట్ ఉందని ప్రజలకి ఏదన్నా చేయాలనే తపనతో ఉన్నారని తెలిపారు జగన్..