వైసీపీకి అనుకూల సర్వేలు..టీడీపీకి ప్లస్ అవుతున్నాయా..??

ఏపీలో వైసీపీ అధికారం దిశగా దూసుకుపోతోంది, టీడీపీ జనసేన పార్టీలు మట్టి కరవడం ఖాయం.ఊహించని రీతిలో ఏపీ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి పట్టం కట్టబోతున్నారు.

 Ys Jagan Party Candidates Ruining Ycp-TeluguStop.com

ఇక చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందేనా అంటూ వివిధ సర్వేలు ఏపీలో హోరెత్తించాయి.అయితే జాతీయ మీడియా సైతం ఏపీలో సర్వేలు చేసి జగనే సీఎం అని చెప్పడం ఎంతో సంచలనం సృష్టించింది.

దీనిపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి.ఇండియా టుడే, టైమ్స్ నౌ, రిపబ్లికన్ టీవీ వంటి విభిన్న మీడియా వర్గాలన్నీ జగన్ కు నీరాజనాలు పట్టాయి.

అయితే ఈ సర్వేలన్నీ జగన్ కి జై కొట్టడం, చంద్రబాబు కి అనుకూలంగా ఒక్క సర్వే కూడా రాకపోవడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం పెల్లుబుకుతోంది.జగనే సీఎం అంటూ నినాదాలు చేసుకున్నారు, చేస్తున్నారు కూడా.

ఇప్పుడు ఈ తరహా సర్వేలే వైసీపీ కొంప ముంచుతున్నాయట.జగన్ అందలం ఎక్కకుండా ఈ సర్వేలే చివరికి అడ్డు పడేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.

ఎందుకంటే.??

వైసీపీ కార్యకర్తలు , నేతలు ఈ సర్వే ఫలితాలు వచ్చిన సమయం మొదలు వాటినే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ తెగ హడావిడి చేసేస్తున్నారు.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీడీపీ కార్యకర్తలు కానీ, నేతలు కానీ ఈ ప్రచారాలను సోషల్ మీడియాలో వస్తున్న వైసీపీ అనుకూల కథనాలను ఎక్కడ పట్టించుకుంటున్న పరిస్థితి లేదు.తమ పని తాము చేసుకుంటూ పక్క వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తున్నారు.

తెలుగుదేశం పార్టీకి ఎప్పటినుంచో బలంగా ఉన్న కార్యకర్తలు గడపగడపకు టీడీపీ ని తీసుకువెళ్లడంలో సక్సెస్ అవుతున్నారు కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం తమ పార్టీకి అనుకూలంగా వచ్చిన సర్వేలనే నమ్ముకుని వాటినే పదేపదే ప్రచారం చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో తిరగడం పక్కన పెట్టేశారు.వారి ఓవర్ కాన్ఫిడెంట్ ఎంతవరకూ ఉందంటే నియోజకవర్గాల వారీగా ఉన్న కార్యకర్తలు, గ్రామస్థాయిలో కార్యకర్తల వాట్సప్ నెంబర్ లు తీసుకుని వాటిలో పార్టీ కార్యక్రమాలు ప్రచారమ చేసుకుంటూ గడిపేస్తున్నారట.

దాంతో జగన్ అలుపెరుగకుండా చేస్తున్న కృషికి ఫలితం లేకుండా పోతోందని అంటున్నారు విశ్లేషకులు.మరి వైసీపీ ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పడుతుందో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube