పట్టం కట్టిన పాదయాత్ర  

Ys Jagan Padayada Wins In Elections పాదయాత్ర-chandra Babu Naidu,cm Jagan,elections,padayada,wins,ys Jagan,పాదయాత్ర

ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమయ్యాయి. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవ్వడంతో పాటు, ఏపీలో వైకాపా విజయం సాధించడం కన్ఫర్మ్‌ అయ్యింది. కేంద్రంలో పరిస్థితి పక్కన పెడితే ఏపీలో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావడంను రాజకీయ విశ్లేషకులు అద్బుతంగా భావిస్తున్నారు..

పట్టం కట్టిన పాదయాత్ర-Ys Jagan Padayada Wins In Elections పాదయాత్ర

ప్రత్యేక ఏపీలో సీఎంగా చంద్రబాబు నాయుడు ఒక్క దఫాలోనే ప్రజలకు బోర్‌ కొట్టాడా అనే ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు నాయుడు సీఎంగా రాష్ట్రం చాలా అభివృద్ది పథంలో నడిపేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లుగా అనిపించింది. కాని ప్రజలు అది నమ్మినట్లుగా లేరు.

వైకాపా వస్తే మరింత అభివృద్ది సాధ్యం అనుకుని జగన్‌ అండ్‌ కో కు జనాలు పట్టం కట్టినట్లుగా అనిపిస్తోంది. వైఎస్‌ జగన్‌ అద్బుతమైన విజయంతో ప్రభుత్వంను ఏర్పాటు చేయబోతున్న ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు ప్రముఖంగా చెబుతున్న మాట పాదయాత్ర. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర చేసిన తర్వాత సీఎం అయ్యాడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పాద యాత్ర చేసి సీఎం అయ్యాడు.

ఇప్పుడు జగన్‌ పాదయాత్ర వల్ల సీఎం అయ్యాడు.పాదయాత్ర వల్లే జగన్‌ సీఎం అయ్యాడనే గట్టి వాదన వినిపిస్తుంది. సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా రాష్ట్రం మొత్తం కూడా జగన్‌ చుట్టేశాడు.

పాదయాత్రకు అద్బుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఆ పాదయాత్ర ఓట్లు తెచ్చి పెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాద యాత్ర చేస్తే అధికారంలోకి వచ్చేస్తారనే విషయం మరోసారి జగన్‌ నిరూపించాడు.

పాదయాత్రతో ఎన్నో సమస్యలు తెలుసుకున్న జగన్‌ ఆ సమస్యలను ఇప్పుడు సీఎంగా తీర్చాలని ఆశిద్దాం.