డబ్బులు కావాలంటూ.... జగన్ పీఏ ! ఇదో తరహా మోసం !

ఇప్పటికే అధికారంలోకి వచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అష్టకష్టాలు పడుతోంది.తెలంగాణాలో టీడీపీ అభాసుపాలవ్వడంతో ఏపీలో కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది.

 Ys Jagan Pa Mobile Number Spoofing-TeluguStop.com

దీంతో వైసీపీలో జోరు పెరిగింది.ఇక టీడీపీ పని అయిపోయిందని… జనసేన హవాకు కాస్త అడ్డుకట్టవేస్తే అధికారం దక్కించుకోవడం పెద్ద కష్టమేమి కాదని వైసీపీ భావిస్తోంది.

ఇక జగన్ పాదయాత్ర దాదాపు ఫినిషింగ్ స్టేజి కి వచ్చెయ్యడంతో సరికొత్తగా ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది.ఈ తరహా హుషారులో ఉన్న వైసీపీకి ఇప్పుడో పెద్ద చిక్కొచ్చిపడింది.

వైసీపీ హవాను క్యాష్ చేసుకునేందుకు ఓ ముఠా రంగంలోకి దిగింది.జగన్‌ పేరుతో ఒక ముఠా దందాలకు పాల్పడింది.

అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ కొందరు పార్టీ నేతల నుంచి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించింది.పది రోజులుగా ఈ వ్యవహారం సాగుతోంది.

అయితే ఈ విషయాన్ని గుర్తించిన వైసీపీ నేతలు హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.జగన్‌ వ్యక్తిగత సహాయకుడు వినియోగిస్తున్న అధికారిక నెంబర్‌ను స్పూఫింగ్‌ చేసి దాని ద్వారా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు.ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు ఈ తరహా కాల్స్ పెద్దఎత్తున వస్తుండడంతో….వైసీపీ అలెర్ట్ అయ్యింది.అయితే… ఈ తరహా మోసాలకు పాల్పడేలా ….స్పూఫింగ్‌ సాఫ్ట్‌వేర్ అందించే వెబ్‌సైట్లు ఇంటర్నెట్‌లో అనేకం ఉండడంతో వాటి ద్వారా స్పూఫింగ్ సాప్ట్‌వేర్‌ను కొనుగోలు చేసేనట్టు భావిస్తున్నారు.

ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని అందులోకి ఎంటర్‌ అయిన తరవాత సదరు దుండగుడి ఫోన్‌ నంబర్‌తోపాటు ఫోన్‌కాల్‌ అందుకోవాల్సిన వ్యక్తిది, ఫోన్‌ రిసీవ్‌ చేసుకునేప్పుడు అతడి సెల్‌ఫోన్‌లో ఎవరి నంబర్‌ డిస్‌ప్లే కావాలో ఆ నెంబర్ ఎంటర్ చేసి వ్యవహారం చక్కబెడుతున్నారు.

ఈ విధంగానే….జగన్ పీఏ నెంబర్ ద్వారా… పలువురికి ఫోన్ లు చేసి మాట్లాడుతున్నారు.దుండగులు.

ఫోన్ రాగానే జగన్‌ వ్యక్తిగత సహాయకుడి పేరు మొబైల్‌లో డిస్‌ప్లే అవుతుండడంతో అది నిజమైన ఫోన్‌ కాల్‌ అనుకుని వైసీపీ నేతలు నమ్మేస్తున్నారు.ఫోన్‌ తీయగానే జగన్‌ తరహాలో మాటలు వినిపిస్తున్నాయి.

తాను పాదయాత్రలో ఉన్నానని, మిగిలిన విషయాలు చర్చించేందుకు వేరే వ్యక్తి సంప్రదిస్తారని చెబుతూ ఫోన్‌ కట్‌ చేస్తున్నాడు.ఆ వెంటనే వాట్సాప్‌ ద్వారా నేతలతో నకిలీ ముఠా చర్చలకు దిగుతోంది.వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో బిజీగా ఉన్నారని చెబుతూ వెంటనే రూ.10 లక్షలు విశాఖపట్నం పంపించాలని సైబర్‌ నేరగాళ్లు సూచిస్తున్నారు.

అంతేకాదు.వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఉన్నందున ఆయనకు కాల్‌ చేసి డిస్ట్రబ్‌ చేయవద్దని, ఆయనే మీకు కాల్‌ చేస్తారంటూ కూడా వారు చెప్పడంతో సదరు నాయకులు అది నిజమేనేమో అని నమ్మేస్తున్నాడు.

ఈ వాట్సాప్‌ నెంబర్‌ డీపీగా ఎంపీ పూనం మహజన్ ఫోటో కనిపిస్తోంది.+ 1(507)407-9047 నెంబర్‌ ద్వారా దుండగులు వాట్సాప్ చాటింగ్ చేస్తున్నారు.ఈ విషయాన్ని పసిగట్టిన వైసీపీ … ఈ మోసాలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.అయితే… ఈ వార్త ఇప్పుడు వైసీపీలో కలకలం రేపుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube