నేడు కర్నూల్ విమానాశ్రయాన్ని ఓపెన్ చేయబోతున్న సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు లో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభం చేయబోతున్నారు.ఈ విమానాశ్రయానికి కేంద్రం అన్ని అనుమతులు ఇవ్వటంతో పనులు వేగంగా పూర్తి చేయటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చొరవ మరువలేనిది అని జిల్లా నాయకులు చెప్పుకొస్తున్నారు.

 Ys Jagan Opens Kurnool Air Port-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం 11 గంటల 45 నిమిషాలకు సీఎం జగన్ విమానాశ్రయానికి చేరుకుని తొలుత జాతీయ జెండాను ఆ తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

సరిగ్గా 12 గంటల 18 నిమిషాలకు విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.

 Ys Jagan Opens Kurnool Air Port-నేడు కర్నూల్ విమానాశ్రయాన్ని ఓపెన్ చేయబోతున్న సీఎం జగన్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో రాయలసీమ ప్రాంతంలోమూడు విమానాశ్రయాలు వచ్చినట్లు అవుతుంది.ఇప్పటికే కడప, రేణిగుంట ప్రాంతాలలో విమానాశ్రయాలు ఉండటంతో తాజాగా కర్నూలు ఓర్వకల్లు లో కూడా విమానాశ్రయం ప్రారంభం కావటంతో మొత్తం మూడు విమానాశ్రయాలు రాయలసీమలో నెలకొన్నట్లు తెలుస్తోంది.

 కరువు కాటకాలతో, వలసలతో అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలలో ఒకటైన కర్నూలులో విమానాశ్రయం రావటం పట్ల ఆ ప్రాంత వాసులు కూడా ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

#YS Jagan #Kadapa #Rayalaseema #Kurnool Airport

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు