ఆ ఒక్క విషయంలో తండ్రిని ఫాలో అవ్వని జగన్!

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా బాద్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ జగన్ ఆశయాల సాధనే లక్ష్యంగా పరిపాలన సాగిస్తా అని చెప్పుకొచ్చారు.అందుకు తగ్గట్లుగా సామాన్యుడుకి పట్టం కట్టే విధంగా పథకాల రూపకల్పన చేసి, ప్రతి ఇంట్లో పట్టెడు అన్నం తినాలి అనే ఆలోచనతో అందరికి ఆర్ధిక స్వాలంబన అందించే విధంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ సమర్ధవంతమైన నాయకుడుగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

 Ys Jagan Not Fallow On Father Way In Operation Akarsh1-TeluguStop.com

తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడానికి ఎదురుచూస్తున్నాడు.అయితే జగన్ తన పరిపాలనలో తన తండ్రి ఆశయాలని బ్రతికించే ప్రయత్నం చేస్తూ ప్రజా సంక్షేమం మీద ద్రుష్టి పెట్టి పరిపాలన సాగిస్తున్న ఒక్క విషయం మాత్రం ఇప్పుడు జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఫాలో అవడం లేదు.

వైఎస్ఆర్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారి ఆపరేషన్ ఆకర్ష్ అంటూ మొదలెట్టి తెలుగు దేశం పార్టీలో గెలిచినా వారిని తన పార్టీలో చేర్చుకోవడంతో పాటు వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చి అందలం ఎక్కించారు.తెలుగు దేశం పార్టీ మీద గెలిచినా కూడా ఎలాంటి రాజీనామాలు చేయించకుండా కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా మార్చేసుకున్నారు.

ఆ సమయంలో వైఎస్ చేసిన ఈ పనిని తప్పు పట్టిన తెలుగు దేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చి వైఎస్ విధానం అవలంబించి వైసీపీ తరుపున గెలిచినా ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకొని వారికి పెద్దపీట వేసి మంత్రి పదవులు కూడా ఇచ్చారు.అలా వైసీపీ తరుపున గెలిచి అధికార పార్టీ కండువా కప్పుకొని మంత్రులుగా చేసిన అందరికి తాజా ఎన్నికలలో షాక్ తగిలింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది.ఇప్పుడు చాలా మంది టీడీపీ నేతలు అవకాశం దొరికితే వైసీపీ గూటికి చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.అయితే అలాంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలకి తన పార్టీలో స్థానం లేదని జగన్ కరాఖండీగా చెప్పేసాడు.దీంతో ఈ ఒక్క విషయంలో జగన్ తన తండ్రిని ఫాలో అవడం లేదని ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube