స్వామి దర్శనం కలుగదేమి ? వైసీపీ నాయకులకు విచిత్ర పరిస్థితి !  

Ys Jagan Not Available For Ycp Leaders After Elections-elections,lotus Pound,phoni Toofan,ycp Leaders,ys Jagan,జగన్,వైఎస్సార్ కాంగ్రెస్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రస్తావన ఇప్పుడు పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయిపొయింది. పోలింగ్ తేదీ తరువాత నుంచి జగన్ పార్టీ నాయకులెవ్వరికి అందుబాటులో లేకుండా ఉండడం పై అనేక విమర్శలు చెలరేగుతున్నాయి. ఒక వేళ జగన్ ఫారిన్ ట్రిప్ లో ఊడడం వల్ల కలవలేకపోతున్నాడా అంటే అదీ లేదు..

స్వామి దర్శనం కలుగదేమి ? వైసీపీ నాయకులకు విచిత్ర పరిస్థితి !-Ys Jagan Not Available For Ycp Leaders After Elections

కానీ ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అలుపెరగకుండా నిత్యం జనం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఏపీలో పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి దేశ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఈవీఎంలని, వీవీ ప్యాట్లని ఏదో పని పెట్టుకుని తిరుగుతున్నారు.

మధ్యలో ఇతర పార్టీలకు ప్రచారం చేస్తున్నారు.అంతే కాదు పార్లమెంటరీ వారీగా సమీక్షలు చేస్తూ కొత్త ప్రభుత్వం రాగానే జరగనున్న పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించారు.

కానీ ఈ స్పీడ్ మాత్రం వైసీపీలో అస్సలు కనిపించడంలేదు.

తాము అధికారంలోకి రాబోతున్నాం అనే నమ్మకం మితిమీరడం వల్లే ఈ విధంగా జరుగుతున్నట్టు అర్ధం అవుతోంది. గెలుస్తున్నాం అంటూ హడావుడి జరిగిపోతోంది. ఎన్నికల్లో ఏం జరిగిందో.

జగన్‌కు ఒక్క సారి మొర పెట్టుకుందామనుకున్నా ఆయన మాత్రం ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదు. ఎంత పెద్ద స్థాయి నాయకుడైనా జగన్ దర్శనభాగ్యం దొరక్క తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఏపీలో పోలింగ్ ముగిసిన వెంటనే జగన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మమ అనిపించి ఊరుకున్నాను.

ఆ తర్వాత విశాఖలో బొత్స సోదరుడి కుమార్తె పెళ్లికి అటెండ్ అయ్యారు. మరో సారి ఫోని తుపాను బీభత్సం సృష్టిస్తున్న సమయంలో. హైదరాబాద్‌లో అవెంజర్స్ సినిమా చూశారు.

అంతే ఇక అప్పటి నుంచి జగన్ ఎక్కడా తన ఉనికి బయటపడకుండా చూసుకుంటున్నారు. జగన్ దర్శనం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా లోటస్ పాండ్ కి క్యూ కట్టినా, అక్కడ నుంచి సార్ లేరు అనే సమాధానమే వస్తుండడం, అక్కడకు వెళ్లిన వారిని నిరాశకు గురిచేస్తోంది. ఇంతకీ జగన్ పార్టీ నాయకులు ఎవరికీ అందుబాటులో ఉండకుండా చేస్తున్న ముఖ్యమైన పని ఏంటబ్బా అనే సందేహం అందరిని పట్టి పీడిస్తోంది..