రైతులకు, వినియోగదారులకు మేలు చేకూరే రీతిలో జనతా బజార్లు..!!

జగన్ సర్కార్ రైతులకు అదేవిధంగా వినియోగదారులకు మేలు చేకూరే విధంగా జనతా బజార్లు ఏర్పాటు చేయటానికి రెడీ అవుతోంది.  ఐదు వేల జనాభా కలిగిన చోట 500 చదరపు అడుగుల విస్తీర్ణం తో జనతా బజార్లు ఏర్పాటు చేయాలని అధికారులకు జగన్ దిశానిర్దేశం చేశారు.

 Ys Jagan New Idea Janatha Bazarsys   Jagan,janatha Bazars,farmers, Andhra Prades-TeluguStop.com

అంతే కాకుండా 50 వేల నుంచి రెండు లక్షల జనాభా కలిగిన చోట 5 నుంచి 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జనతా బజార్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

బయట మార్కెట్ లో కన్నా తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు మీ జనతా బజార్లలో లభించాలని అప్పుడే నిర్దేశించిన ఉద్దేశం నెరవేరినట్లు అవుతుందని సీఎం స్పష్టం చేశారు.

జనతా బజార్లు వలన రైతులకు కనీస మద్దతు ధర మరోవైపు వినియోగదారులకు నాణ్యమైన సరుకులు తక్కువ ధరకు ప్రభుత్వం అందించినట్లు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు.దీంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జనతా బజార్ లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube