సరికొత్త కార్యక్రమంతో ఉగాది తర్వాత జనాల్లోకి జగన్..!! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి చాలా కాలమైనా సంగతి తెలిసిందే.అడపాదడపా కార్యక్రమాలలో పాల్గొన్న జగన్ ప్రజలతో నేరుగా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మాదిరిగా ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటిదాకా ఇంటరాక్ట్ కాలేదు.

 Ys Jagan New Idea Implement  In Publichttps Ys Jagan, East Godavari, Rachha Band-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఎప్పటినుండో జగన్ రచ్చబండ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడానికి ఆలోచన చేస్తూ ఉండగా తాజాగా దానికి రూపకల్పన అయినట్లు ప్రభుత్వ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

గత ఏడాదిలోనే ఈ కార్యక్రమం చేపట్టాలని జగన్ ఆలోచించగా మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకి వాయిదా పడుతూ వచ్చింది.

ఇలాంటి తరుణంలో ఉగాది పండుగ తర్వాత తూర్పు గోదావరి జిల్లా నుండి రచ్చబండ కార్యక్రమం స్టార్ట్ చేసే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు టాక్.ఈ నేపథ్యంలో రేషన్ కార్డులకు సంబంధించి మరి ఏ ఇతర సమస్యలు తన దృష్టికి రాకుండా ముందుగానే చర్యలు చేపట్టాలని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అన్నట్లు జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

దీంతో ఏప్రిల్ మాసం లో వైయస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమానికి రెడీ అవుతున్నట్లు సరికొత్త టాక్ ప్రస్తుతం వినబడుతోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube