వైసీపీ నెంబర్ 2 ని జగన్ పక్కనపెట్టేశారా ?

ఏపీలో జగన్ పాలన మొదలయ్యి ఏడాది పూర్తి అయిపోయింది.ఈ ఏడాదిలో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా జగన్ మారారు.

 Andhra Pradesh, Ycp, Jagan, Vijay Sai Reddy, Alla Nani, Sajjala Ramakrishna Redd-TeluguStop.com

ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.ప్రజా సంక్షేమ పథకాలు అమలులోనూ సరికొత్త రికార్డును సృష్టించారు.

జగన్ ఏడాది కాలంలో నిత్యం ఆయన పక్కనే ఉంటూ, అన్ని విషయాల్లోనూ చేదోడువాదోడుగా ఉంటూ, పార్టీలో నెంబర్ స్థానంలో కొనసాగుతూ వచ్చిన వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ని జగన్ పక్కన పెట్టారనే అభిప్రాయం ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది.దానికి తగ్గట్టుగానే ఆయన జగన్ కు కాస్త దూరమవుతున్నట్లు గా అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మొదటి నుంచి విజయసాయిరెడ్డి కి జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు.పార్లమెంటరీ నేతగా, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయిరెడ్డి చక్రం తిప్పారు.

అలాగే అన్ని రాజకీయ వ్యవహారాల్లోనూ, ఆయన ఎక్కువగా జోక్యం చేసుకుంటూ ఉండే వారు.

ఎవరైనా పార్టీలో చేరాలన్న, ఏదైనా నామినేటెడ్ పదవి పొందాలన్న విజయసాయి రెడ్డి ఆశీస్సులు ఉండాల్సి వచ్చేది.

అలాగే పార్టీలో కీలక నాయకుడైన విజయసాయిరెడ్డికి చెప్పకుండా జగన్ వరకు ఏ విషయం వెళ్ళేది కాదు.కానీ కొద్ది రోజులుగా జగన్ విజయసాయిరెడ్డిని జగన్ పక్కన పెడుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇటీవల విశాఖ ఎల్జి పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ ఆ సమయంలో కారు ఎక్కి కూర్చున్న విజయసాయిరెడ్డిని దించేసి ఆస్థానం లో మంత్రి ఆళ్ల నాని ఎక్కించుకొని వెళ్లారు.ఈ వీడియో బయటకు రావడంతో విజయసాయిరెడ్డిని జగన్ పక్కన పెడుతున్నారనే అనుమానం మొదలైంది.

విజయ్ సాయి రెడ్డి కూడా ఆ వ్యవహారంలో తీవ్ర అసంతృప్తికి గురయ్యారట.

Telugu Alla Nani, Andhra Pradesh, Jagan, Tadepalli, Vijay Sai Reddy-Political

ఇక వైసిపి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆనందం ఉన్నాయి.కానీ విజయసాయి ఈ సంబరాలకు సంబంధించి ఎక్కడా స్పందించలేదు.కొద్దిరోజులుగా సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ రంగాలకు సంబంధించిన విషయాలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశాల్లో పార్టీలోని కీలక నాయకులంతా కనిపిస్తున్నారు కానీ విజయసాయిరెడ్డి మాత్రం కనిపించడం లేదు.అలాగే వైసీపీ ఏడాది పాలన సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవ ఉత్సవాల్లోనూ ఆయన కనిపించకపోవడంతో పార్టీలో ఇప్పుడు ఈ విషయం పై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

అది కాకుండా వార్షికోత్సవానికి ముందు రోజునే విజయసాయిరెడ్డి విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లిపోవడం కూడా అనేక అనుమానాలను కలిగిస్తోంది.

విజయ్ సాయి రెడ్డి స్థానంలో జగన్ తన రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, కొద్దిరోజులుగా ఆయనే ఫోకస్ అయ్యేవిధంగా చేస్తుండడం, ఇప్పుడు విజయ్ సాయి స్థానంలో సజ్జలను జగన్ తీసుకొచ్చి ప్రాధాన్యం పెంచినట్టుగా సంకేతాలు ఇస్తుండడం ఇవన్నీ అనుమానాలకు కారణంగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube