వైసీపీని జ‌గ‌న్ వ‌దిలేసిన‌ట్టేనా..!

వైసీపీని జ‌గ‌న్ వ‌దిలేయ‌డ‌మా…ఈ హెడ్డింగ్ చూసిన వాళ్లు కాస్త షాక్ అయ్యి.జ‌గ‌న్ అంటే ఏ జ‌గ‌న్ వైఎస్‌.

 Ys Jagan Neglecting Telangana-TeluguStop.com

జ‌గ‌నేనా అని ప్ర‌శ్నించుకుంటారు.ఎస్ వైఎస్‌.జ‌గ‌నే…జ‌గ‌నే వైసీపీని వ‌దిలేస్తున్నాడా ? ఇప్పుడు అంద‌రిలోను ఇవే సందేహాలు క‌లుగుతున్నాయి.అదేంటి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి సీఎం అవుతాన‌ని చెపుతోన్న జ‌గ‌న్ ఆ పార్టీని వ‌దిలేయ‌డం ఏంట‌బ్బా అని అంద‌రూ స్ట‌న్ అవ్వ‌క‌త‌ప్ప‌దు.

అయితే జ‌గ‌న్ వ‌దిలేది ఏపీ వైసీపీని కాదు…తెలంగాణ‌లో ఆ పార్టీని చాలా లైట్ తీస్కొంటున్నాడు.

తెలంగాణ‌లో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఖ‌మ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికార టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు.

ఇక ఆ పార్టీకి అక్క‌డ ప్ర‌జాప్ర‌తినిధులు ఎవ్వ‌రూ లేరు.తెలంగాణ పార్టీ బాధ్యతలను జగన్ తొలుత తన సోదరి షర్మిలకు అప్పగిస్తామని ప్రకటించారు.అయితే కొన్నాళ్ల క్రితం ఓదార్పు యాత్ర ప్రారంభించిన షర్మిల మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.దీంతో తెలంగాణ వైసీపీని పట్టించుకునే నాథుడే కరవయ్యారు.

ఇక ప్ర‌స్తుతం ఏపీలో 2019లో గెలిచి సీఎం అయ్యేందుకు ఇక్క‌డే కాన్‌సంట్రేష‌న్ చేస్తోన్న జ‌గ‌న్‌కు తెలంగాణ‌లో పార్టీ వ్య‌వ‌హారాలు చూసేంత తీరిక లేదు.తెలంగాణ వైసీపీ ప్లీన‌రీ ఈ నెల 22న నిర్వ‌హించేందుకు వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది.

ఈ ప్లీన‌రీకి పార్టీ అధినేత జ‌గ‌న్ హాజ‌ర‌వుతార‌ని కూడా పార్టీ ప్ర‌క‌టించింది.అయితే అదే రోజు జ‌గ‌న్ విశాఖ భూకుంభ‌కోణంపై సీబీఐ ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని డిమాండ్ చేస్తూ విశాఖ‌లో మ‌హాధ‌ర్నాలో పాల్గొంటున్నారు.

దీనిని బట్టి చూస్తే తెలంగాణ వైసీపీని జ‌గ‌న్ వ‌దిలేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది.మ‌రో ట్విస్ట్ ఏంటంటే జ‌గ‌న్ హైద‌రాబాద్‌లోనే ఉంటున్నా…ఇక్క‌డ త‌ను క‌లిసేందుకు వ‌స్తోన్న తెలంగాణ వైసీపీ నాయ‌కుల‌కు అపాయింట్‌మెంటే ఇవ్వ‌డం లేద‌ట‌.

గ‌త యేడాదిగా ఆయ‌న తెలంగాణ పార్టీ నేత‌ల‌ను క‌లిసిందీ లేదు.మాట్లాడిందీ లేదు.

అందుకే ఆయ‌న ఏకంగా పార్టీ ప్లీన‌రీనే లైట్ తీస్కొన్న‌ట్టు క‌న‌ప‌డుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube