జగన్ మీద అసంతృప్తి ఈ రేంజ్ లో ఉందా ?

ఏపీలో కొత్తగా కొలువుతీరిన వైసీపీ ప్రభుత్వం పై అప్పుడే అసంతృప్తి జ్వాలలు పెరిగిపోతున్నాయి.అయితే ఈ అసంతృప్తులన్నీ సొంత పార్టీ నేతల నుంచే కావడంతో అధిష్టానం కక్కలేక మింగలేక అన్నట్టుగా ఈ వ్యవహారాలన్నీ బయటకి రాకుండా జాగ్రత్త పడుతుంది.

 Ys Jagan Mohan Reddy Party Leaders And Workers Show They Egos1 1-TeluguStop.com

ఇంతకీ పార్టీలో నాయకులు అసంతృప్తి రాగం వినిపించడానికి ప్రధాన కారణం మంత్రి మండలి ఏర్పాటులో జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారు ఎవరికీ సరైన ప్రాధాన్యం దక్కకపోవడమే కారణంగా తెలుస్తోంది.ముఖ్యంగా ముందు నుంచి మంత్రి పదవి గ్యారంటీ అనుకున్న వారెవరికి చోటు దక్కకపోవడంతో వారంతా డైలమాలో పడ్డారట.

అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కీలక పదవులు దక్కించుకున్నవారిని సైతం జగన్ పక్కన పెట్టడం ఆయా నేతలకు రుచించడం లేదు.

ప్రస్తుతం జగన్ మీద కినుకు వహించిన నాయకుల జాబితాలో మాజీ మంత్రి ప్రస్తుత శ్రీకాకుళం ఎమ్యెల్యే ధర్మాన ప్రసాదరావు, నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి కూడా ఉన్నారు.

కాంగ్రెస్ హయాంలో ఆర్థికశాఖ వంటి కీలక బాధ్యతలు నిర్వహించిన ఆనం రామనారాయణరెడ్డికి జగన్ కేబినెట్‌లో కీలక పదవి దక్కుతుందని అంతా భావించారు.కానీ జగన్ మాత్రం సీనియర్లను పక్కనపెడితూ కొత్తవారికి అవకాశం కల్పించారు.

అలాగే వైఎస్ హయాంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు ను పక్కనపెట్టి ఆయన సోదరుడు కృష్ణదాస్ కి అవకాశం కల్పించారు.దీంతో ధర్మాన లోలోపలే అసంతృప్తితో రగిలిపోతున్నారట.

-Telugu Political News

ఇలా అనేకమంది కీలక నాయకులు అసంతృప్తితో ఉన్నట్టు జగన్ దృష్టికి రావడంతో వారిని స్వయంగా పిలిచి బుజ్జగిస్తున్నారట.ఇప్పుడు తాను ఏర్పాటు చేసిన మంత్రి మండలి కూడా అనేక సామజిక సమీకరణ లెక్కల ప్రకారం ఏర్పాటు చేశామని, మీకు రెండున్నరేళ్ల తరువాత తప్పకుండా అవకాశం దక్కుతుంది అంటూ వారికి నచ్చచెప్తున్నాడట.అప్పటివరకు మీరు కాస్త ఓపిక పట్టి పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా వ్యవహరించాలని సూచిస్తుండడంతో వారు మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతున్నారట.కారణం ఏదైనా తమకంటే రాజకీయంగా జూనియర్లకు అవకాశం దక్కడం, తమను పక్కకు పెట్టడంతో జగన్ మీద చాలామంది నాయకులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube